
…మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి. —మత్తయి 26:41
యేసు సిలువ వేయబడుటకు ముందు రాత్రి ఆయన గెత్సేమానే తోటలో తన శిష్యులతో ఒక విన్నపం చేసియున్నాడు: మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు (ధ్యానము కలిగి, శ్రద్ధతో) ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు (మత్తయి 26:41).
శిష్యులు చేయవలసినదేమనగా మెలకువగా ఉండి ప్రార్ధన చేయుట, కానీ వారు గాఢ నిద్రలో ఉన్నారు. మరో విధంగా చూస్తే యేసు, ప్రార్ధించాడు మరియు సిలువను జయించునట్లు ఆత్మతో దేవుని దూత ద్వారా బలపరచబడ్డాడు. శిష్యులు ప్రార్ధించలేదు – వారు నిద్రించారు – మరియు శరీరము బలహీనమని వారు రుజువు చేశారు.
నాకు, ఈ కథ ప్రార్థన యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతను రుజువు చేస్తుంది. క్రైస్తవులముగా మనము రోజువారీ ప్రార్థన లేకుండా మరియు దేవునితో పరస్పర సంబంధం లేకుండ మనకు ఏమీ లేదు అని తెలుసుకోవాలి.
మనం మన “బలహీన శరీరము” ప్రకారం జీవించుటతో పోరాడుతున్నాం కానీ ప్రార్థనకు ప్రాధాన్యత నిచ్చుట ప్రారంభించినట్లైతే మన శరీరంలోని పరిమితులను అధిగమించేందుకు అనుమతించేలా దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు.
నేడు మీరు బలం కోసం దేనిపై ఆధారపడతారు? మీ శరీరమా? లేదా మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు మనపట్ల కనికరం కలిగించే శక్తిని అనుభవిస్తున్నారా?
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నాకు బలం ఇచ్చావు కాబట్టి నీకు వందనములు. నీవు లేకుండా నేను బలహీనంగా ఉన్నాను, కాబట్టి ప్రార్థనలో నిరంతరంగా మీ దగ్గరకు రావటానికి ఎన్నుకున్నాను, మీ బలం నాకు ఎంతో అవసరం అని తెలుసుకున్నాను.