మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? —1 కొరింథీ 3:3
రెండు రకాలైన క్రైస్తవులున్నారు, మరియు మీరు దేనికి చెందినవారో మీరు ఎంపిక చేసుకోండి. నీవు శారీరక సంబంధమైన క్రైస్తవుడవా లేక ఆత్మీయ క్రైస్తవుడవా?
శారీరక సంబంధమైన క్రైస్తవుడు మనుష్యులను సంతోష పెట్టుచు దేవునికి విధేయత చూపుట కంటే ప్రజలు వారిని గురించి ఏమనుకుంటున్నారో అని శ్రద్ధ కలిగి యుంటాడు. వారు పరిపక్వత లేని వారు, వారు ఏమి చేయాలనీ లేక చెప్పాలని అనుకుంటారో వాటినే చేస్తూ వారు ఉద్రేకముల ద్వారా పని చేస్తూ ఉంటారు. వారు సాధారణంగా పోరాటము, సంతృప్తి లేక పోవుట, త్వరగా బాధపడుట మరియు సమాధానము లేకుండా ఉంటారు.
ఒక ఆత్మీయ క్రైస్తవుడు పరిశుద్ధాత్మ యొక్క కోరికలను విడువక అనుసరించేవాడు. వారు ప్రతిరోజు వాక్యముతో వారి ఆత్మను నింపుచూ, వారి జీవితములోని ప్రతి పరిస్థితిలో దేవునిని అనుమతిస్తారు. దేవునితో వారి సంబంధము వారములోని ప్రతి రోజు కలిగి యుంటారు కానీ కేవలం వారమునకు ఒకసారి చర్చి జరిగే సమయంలో మాత్రమే కాదు.
ఒకవేళ మీరు ఇప్పుడే దానిని చేయని యెడల, క్రీస్తును అనుసరించుటకు జీవితకాల ప్రమాణము చేయమని మిమ్మును అర్థిస్తున్నాను. మీరు చేసే ప్రతి పనిలో దేవునిని కలిగి యుండండి. ప్రేమలో నడచుట, నిజాయితీతో , తగ్గింపుతో మరియు సమాధానముతో నడచుట. ఇతరులతో సమాధానముగా ఉండుట. ఆత్మఫలమును ఫలించుట మరియు దేవుని కృపలో ఆనందించుట.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను శారీరక సంబంధమైన క్రైస్తవుడుగా, ఎల్లప్పుడూ లోకరీతిగా నడిపించబడాలని ఆశించుట లేదు. బదులుగా నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించ బడవలేనని, నిన్ను ఆనందింపజేసే జీవితమును జీవించాలని ఆశిసున్నాను. నేను ఈరోజు శరీర సంబంధమైన క్రైస్తవుడుగా కాక ఆత్మీయ క్రైస్తవుడుగా ఉండాలని ఆశిస్తున్నాను.