శిక్షవిధి కాదు, క్షమాపణను పొందుకోండి

శిక్షవిధి కాదు, క్షమాపణను పొందుకోండి

మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. -1 యోహాను 1: 9

మన జీవితాలలో ప్రతిరోజూ మనకు క్షమాపణ అవసరం. పరిశుద్ధాత్మ పాపమును గుర్తించడానికి మన హృదయాలలో అలారంను ఉంచుతుంది, మరియు పాపము నుండి నిరంతరం పరిశుద్ధ పరచుటకు మరియు దేవునితో యధార్ధముగా నిలబడి ఉండటానికి యేసు యొక్క రక్తము మరియు శక్తిని ఆయన మనకిస్తాడు.

అయితే శిక్షవిధిని జయించకపోతే, అది ఖచ్చితముగా దేవుని నుండి కాదు. మన పాప పరిహారాన్ని చెల్లించడానికి యేసు మనకోసం చనిపోయాడు. యేసు సిలువపై మన పాపమును మరియు శిక్షను భరించాడు. (యెషయా 53 చూడండి).

దేవుడు మన పాపపు కాడిని విరుగ గొట్టినప్పుడు, ఆయన నేరాభావాన్ని కూడా తొలగిస్తాడు. ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1: 9 చూడండి).

అపరాధం మరియు అవమానము  ప్రార్థనలో మనలను దేవుని దగ్గరికి రానివ్వటానికి సాతానుడు అడ్డుకుంటాడని మనకు తెలుసు, కాబట్టి మనము క్షమాపణ పొందవచ్చు మరియు ఆయనతో సన్నిహిత సహవాసంలో ఆనందించవచ్చు.

మనల్ని గురించి చెడుగా భావించుట లేక దేవుడు మనతో కోపముగా ఉంటాడని నమ్ముట వలన ఆయన సన్నిధి నుండి మనము వేరుపరచబడతాము. ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు, కాబట్టి శిక్షావిధి వలన ఆయన నుండి ఉపసంహరించుకోకూడదు. అతని క్షమాపణ స్వీకరించండి మరియు ఆయనతో కలిసి నడవండి.

ప్రారంభ ప్రార్థన

దేవా, శిక్షావిధి నీ నుండి కాదని నాకు చూపించినందుకు ధన్యవాదాలు. నేడు, నేను నీ క్షమాపణను పొందుతాను. నేను నీతో యధార్ధముగా నిలబడుటకు నీవు నా పాపమును కడిగివేసియున్నావు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon