ప్రతి విషయమునందును (ఎటువంటి పరిస్థితిలోనైనను) (దేవునికి) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట (ఎవరైతే) యేసుక్రీస్తునందు (ఉంటారో వారి విషయంలో) మీ విషయములో దేవుని చిత్తము. —1 తెస్స 5:18
మనమెల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని బైబిల్ మనలను ప్రోత్సహిస్తుంది. దేవుడు మన ప్రార్ధనలకు జవాబులు ఇచ్చినప్పుడు మరియు సమస్యల నుండి విడుదల కలిగించినప్పుడు ఇలా చేయుట చాలా సులభము. కానీ పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు ఇది చాల కష్టము. కాబట్టి శ్రమలలో కూడా మనమెలా కృతజ్ఞత కలిగి యుండగలము?
మనము తీసుకొనవలసిన రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటిది ఎదనగా మన జీవితాల్లో ఏది సంభవించినా దేవునిని స్తుతించుట లేక మరియొక విధానమేదనగా మన కష్టాలు మరియు సమస్యల్లో దేవుని విడువని ప్రేమ మరియు మన యెడల ఆయన కలిగియున్న నమ్మకత్వమును బట్టి మరియు మన జీవితాల్లో సరియైన విషయాలను గురిచి ఆయన యందు ఆనందించుట.
రెండవ ఎంపిక ఎదనగా, “దేవా, నేను దీని నుండి ఏమి నేర్చుకోవలెను? నేను నీకు సన్నిహితముగా ఉంటూ మీ మేలులను బట్టి ఎక్కువగా మీయందు ఆనందించుటకు నాకు నీవేమి బోధించుచున్నావు?” అని దేవునిని అడుగుట. ఇవి సులభమైన ప్రశ్నలు కావు మరియు వీటి జవాబులు వినుటకు కొన్నిసార్లు చాల కఠీనముగా ఉంటాయి.
కొన్నిసార్లు, మనము కష్ట సమయాల గుండా వెళ్తున్నప్పుడు మనము ప్రాముఖ్యమైన పాఠములను మాత్రమే గ్రహిస్తాము. కష్ట సమయాలు ఉత్తమమైన విషయాలకు నడిపిస్తాయి కనుక దేవునికి వందనములు.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ ప్రేమ మరియు మీ సన్నిధిని బట్టి మీకు వందనములు. పొరపాటులు జరిగినప్పుడు గొణిగినందుకు నన్ను క్షమించండి మరియు అనేక విషయములు నాకు మంచి కార్యములుగా ఉన్నాయి. నేను నీలో ఎల్లప్పుడూ ఆనందిస్తాను.