సంక్షోభ నిర్వహణ

సంక్షోభ నిర్వహణ

పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. (ప్రసంగి 8:12)

సంక్షోభ నిర్వహణను గురించి దేవుడు మనము కొన్ని విలువైన పాఠములను నేర్పియున్నాడు. యేసు చెప్పెను, “నా యొద్దకు రండి” (మత్తయి 11:28); మనము అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఫోన్‌ చేయుటకు పరిగెత్తండి మరియు ముగ్గురు స్నేహితులకు కాల్ చేయండి అని ఆయన చెప్పలేదు. మన కోసం ప్రార్థించమని ప్రజలను అడగడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మనం ప్రజల వద్దకు పరిగెత్తితే, మనకు నివారణ దొరకదు; మనము బాండెజ్ (కట్టు) మాత్రమే కనుగొంటాము.

జీవితంలో ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు సంక్షోభాలు ప్రధానమైనవి; కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉంటాయి. స్థిరమైన అత్యవసర పరిస్థితుల్లో జీవించకుండా ఉండేందుకు, విడువక లేదా శ్రద్ధగా ఆయనను వెదకాలని ప్రభువు నన్ను ఆకట్టుకున్నాడు. నేను ఎప్పుడో ఒకసారి లేదా నా జీవితం పెద్ద కష్టాల్లో ఉన్నప్పుడు దేవునితో సమయం కోసం వెదకే దానిని. చివరికి, నేను ఎప్పుడైనా సంక్షోభ స్థితి నుండి బయటపడాలని కోరుకుంటే, కష్ట సమయాల్లో మరియు గొప్ప ఆశీర్వాదాల కాలములో నేను ఎల్లప్పుడూ దేవునికి తీరని అవసరం ఉన్నట్లుగా దేవునిని వెతకాలని నేను తెలుసుకున్నాను.

మనకు మేలు జరుగుతున్నప్పుడు మనం తరచుగా దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ మనం నిరాశకు గురైనప్పుడు మాత్రమే మనం దేవునిని వెతుకుతున్నట్లయితే, మనలను ఆయనతో సహవాసంలో ఉంచడానికి ఆయన తరచుగా మనల్ని నిరాశాజనక పరిస్థితులలో ఉంచుతారని నేను గమనించాను.

మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనల్ని రక్షించి సహాయం చేస్తాడు. కానీ మనం స్థిరమైన శాంతి మరియు విజయాల ప్రదేశంలో ఉండాలనుకుంటే, ఈరోజు వాక్యం మనల్ని కోరినట్లుగా, మనం ఎల్లప్పుడూ ఆయనను శ్రద్ధగా వెతకాలి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: అన్నీ సమయాల్లో దేవునితో సహవాసములో నిలిచియుండుట ద్వారా మేలైన సంక్షోభ నిర్వహణను అభ్యాసం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon