సంబంధాన్ని ఇవ్వండి… మతము కాదు

సంబంధాన్ని ఇవ్వండి... మతము కాదు

అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా (ఒక నూతన వ్యక్తిగా, పై నుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని (ఎన్నడూ తెలుసుకోలేదని, అనుభవం లేదని) నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. —యోహాను 3:3

మీరు మీ విశ్వాసం గురించి ఎవరైనా చెప్పినప్పుడు, మీరు వారికి మతం గురించి చెప్తారా లేదా సంబంధం గురించా?
మనము తిరిగి జన్మించాలని బైబిల్ చెప్తుంది (యోహాను 3:1-8 చూడండి) – ఇది మనము మతపరంగా ఉండమని చెప్పడం లేదు. దురదృష్టవశాత్తు, ప్రజలు తరచూ సువార్త గురించి, ఇది దేవునితో నిజమైన సంబంధం కాదు కాకుండా మత నియమాల జాబితాను గురించి చెప్తారు.
కానీ గ్యారేజ్ లో కూర్చుంటే మీకు ఎవరు ఒక కారు తయారు చేసి ఇవ్వనట్లే, “క్రైస్తవ” నియమాలను అనుసరించడం మరియు చర్చికి వెళ్లడం మీరు ఒక క్రైస్తవుడిగా చేయదు.
మతపరమైన నియమాలు మరియు నిబంధనలు కఠినమైనవి, చాలా ధృఢమైనవి, కానీ యేసు ప్రజలనుండి దానిని కోరుటలేదు. యేసు తనతో సంబంధం కలిగి జీవించాలని కోరుతున్నాడు.
“మీది ఏ మతం?” అని ఎవరైనా అడిగినప్పుడు మనము చర్చికి హాజరగుటను గురించి చెప్పుటకు బదులుగా యేసుతో మీ వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడాలి. నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను, “అడిగినందుకు ధన్యవాదాలు. నాకు ఏ మతం లేదు, కాని నేను యేసును కలిగి యున్నాను. ”
మేము ప్రజలను అడుగుతూ, “మీకు యేసును గురించి తెలుసా? అతను మీ స్నేహితుడా? మీరు అతనితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారా? “అని మనము ప్రజలను అడుగట ప్రారంభించాలి.
తదుపరిసారి ఎవరైనా మీ విశ్వాసం గురించి అడుగుతారు, వారికి సంబంధం ఇవ్వండి … మతం కాదు.

ప్రారంభ ప్రార్థన

దేవా, నిజంగా ఎవరైనా ఒక క్రైస్తవుడుగా ఉండాలని కొన్ని నియమాల జాబితా అనుసరించాలని ఆలోచించే ఉచ్చు పడటం చాలా సులభం. కానీ అది నా నుండి మీరు ఆశించే విశ్వాసం రకం కాదు. ఇతరులను మీ జీవితంతో మార్చివేసే సంబంధానికి దారి తీసే విధంగా మీ సువార్తను పంచుకొనుటకు నాకు అధికారం ఇవ్వండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon