సత్యమును ఎదుర్కొనుట వలన సంతోష జీవితమును ఇస్తుంది

సత్యమును ఎదుర్కొనుట వలన సంతోష జీవితమును ఇస్తుంది

మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే (క్రీస్తును కాక) శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా? …. —2 కొరింథీ 13:5

ఎవరూ తమ సమస్యలను ఒప్పుకొనకుండా సమస్య నుండి విడుదల పొందలేరు. మద్యపాన, మాదకద్రవ్యాల బానిసలు లేదా వారి జీవితంపై నియంత్రణ కోల్పోయిన ఎవరైనా “నాకు సమస్య ఉంది మరియు నాకు సహాయం కావాలి” అని చెప్పగలిగే వరకు బాధపడతారు.

మన ఇష్టానికి విరుద్ధంగా చేసిన క్రియల కారణంగా సమస్యలు మనపైకి వచ్చినప్పటికీ, మన జీవితాంతం సమస్యను కొనసాగించడానికి, పెరగడానికి మరియు నియంత్రణ చేయడానికి మనము అనుమతించాల్సిన అవసరం లేదు. మన గత అనుభవాలు మనలను ఇటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చినా అందులో నిలిచి యుండాల్సిన అవసరం లేదు.   విషయాలను మార్చడానికి సానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా మనం చొరవ తీసుకోవచ్చు – మరియు మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనము దీనిని సాధ్యం చేయవచ్చు.

మీ సమస్య ఏదైనప్పటికీ మీరు సత్యమును ఎదుర్కొని కొంత వ్యక్తిగత బాధ్యతను తీసుకొనవచ్చును.  మనల్ని మనము సమీక్షించవలెనని బైబిల్ చెప్తుంది, కానీ యేసుక్రీస్తు మీలో ఉన్నాడు మరియు మీ గత సమస్యలు మరియు పరిస్థితుల నుండి మిమ్మును విడిపిస్తాడు.

సత్యమును ఎదుర్కోండి – అది సంతోషకరమైన జీవితమునకు ప్రారంభమవుతుంది!

ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నేను నా సమస్యల భయముతో జీవించాలని ఆశించుట లేదు. నన్ను నేను సమీక్షించుకొని ఈ విషయాలను లోతుగా పరిశీలిస్తాను ఎందుకంటే నేను సంతోషకరమైన జీవితమును కలిగియుండునట్లు నీవు నాకు సహాయం చేయగలవని నమ్ముతున్నాను. 

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon