కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. —రోమా 15:13
నేను అనేక సంవత్సరముల క్రితము నా జీవితంలో ఆనందము మరియు సమాధానము లేనప్పుడు కష్ట సమయాల గుండా వెళ్లి యున్నాను. నేను తప్పు చేసిన ప్రతిసారీ నన్ను నేను త్వరగా శిక్షించుటకు సిద్ధపడి, నేను పరిపూర్ణురాలిని కానని కోపగించుకునే దానిని.
తరువాత ఒక రోజు, నేను రోమా 15:13 చదివి యున్నాను: నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. …. అంతే! నేను దానిని పొందుకున్నాను!
నేను సందేహము మరియు అపనమ్మకములో మునిగి యుండగా వ్యతిరేకత, కోపము మరియు అసహనముతో సాతానుడు నన్ను బాధపెట్టునట్లు అనుమతిస్తున్నానని నేను గుర్తించి యున్నాను. ఈ ప్రక్రియలో నేను దేవుని వాక్యమునందు విశ్వాసముంచుట ద్వారా మరియు ఆయన వాక్యమందు నమ్మిక యుంచుట సమాధానము మరియు నిరీక్షణను పొంది నా బలహీనతలో విజయం పొందుతానని నేను మరచి యున్నాను.
దేవుని వాక్యము నాకు జవాబిచ్చింది. యేసు నన్ను ఎంతగా ప్రేమించాడంటే నా గత పాపములను శుద్ధి చేయుట మాత్రమే కాక నా భవిష్యత్తులో నేను బలహీన క్షణాలను కూడా అయన క్షమించి యున్నాడు. నేను అపనమ్మకము అనే ప్రశ్నలతో నన్ను బాధించుటకు సాతానును అనుమతించ వలసిన అవసరం లేదు.
ఈరోజు సమాధానము, నిరీక్షణ మరియు ఆనందమును మీ ఎదుట ఉన్నవని తెలుసుకొనుము. దేవుని వాక్యము లోనికి వెళ్లి అవి మీ విశ్వాసమును ప్రజ్వలింప జేయునట్లు అనుమతించండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, ప్రతి సారి నేను నా శత్రువు యొక్క అబద్ధాలను నమ్ముట ప్రారంభిస్తుండగా మీ వాక్యములోని సత్యమును గుర్తు చేయుము. మీలో నమ్మిక యుంచు చుండగా ఈరోజు నేను సమాధానము మరియు ఆనందమును పొందుకుంటాను.