క్రీస్తు అనుగ్రహించు (ఆత్మ సమరస్యముతో వచ్చు) సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి (అంపైర్ గా ఉండుట కొనసాగించండి); ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. (కొలస్సీ 3:15)
నేను సమాధానమును కనుగొనుటలో నా జీవితమును గడుపుటకు ప్రయత్నిస్తున్నాను. నేను షాపింగ్ చేస్తున్నట్లైతే, నాకు దేని విషయంలోనైనా సమాధానము లేకపోతే నేను దానిని కొనను. నేను ఏదైనా సంభాషణలో ఉన్నప్పుడు అందులో నాకు సమాధానము లేకపోతే నేను ఆపివేస్తాను. నేను నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా యెదుట ఉన్న ఎంపికలను చూస్తాను మరియు అందులో సమాధానము ఉంటేనే నిర్ణయం తీసుకుంటాను. నేను దేవుని స్వరానికి మరియు నా దృష్టికి సారించే ఇతర స్వరాలకు మధ్య తేడా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఏ స్వరం లేదా సందేశం నా హృదయంలోకి దేవుని సమాధానమును తీసుకువస్తుందో దానినే నేను వింటాను.
మన జీవితాల్లో బలాన్ని కొనసాగించాలంటే సమాధానమును కాపాడుకోవడం చాలా ముఖ్యమని నేను తెలుసుకున్నాను. మనకు సమాధానము లేనప్పుడు, మనం చాలా భయంకరమైన తప్పు చేయవచ్చు. మనం ఎప్పుడూ సమాధానము లేకుండా ప్రవర్తించకూడదని చెప్పేంత వరకు నేను వెళ్తాను. సమాధానము అనేది మనం తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు ఆమోదించే “అంతర్గత నిర్ధారణ” అని చెప్పవచ్చు.
దేవుడు మనల్ని సమాధానములో నడిపిస్తాడు. ఈరోజు వాక్యము మనకు చెప్తున్నదేమనగా సమాధానము అనేది ఏది భద్రత కలిగి యున్నదో లేక భద్రత కలిగి యుండదో నిర్ణయించే అంపైర్ లాంటిది! మన మనస్సులలో తలెత్తే అన్ని ప్రశ్నలను మరియు మన జీవితంలో మనం తీసుకోవలసిన నిర్ణయాలను నిర్ణయించడం మరియు అంతిమంగా పరిష్కరించడంలో మన మనస్సులలో మరియు ఆత్మలలోని అంతర్గత సామరస్యాన్ని పాలించనివ్వాలి మరియు మన హృదయాలలో నిరంతరం అంపైర్‌గా వ్యవహరించునట్లు అనుమతించాలి.
మనలో మనస్సాక్షికి అసౌకర్యంగా అనిపించే పనులను అడ్డుకోవడం, తప్పు మరియు ఒప్పు అనే మన స్వంత భావాన్ని పాటించడం నేర్చుకోవాలి. మనం ట్రాక్‌లో ఉన్నామా లేదా అని మనకు తెలియజేయడానికి దేవుడు మన మనస్సాక్షి నుండి సమాధానమును ఇస్తాడు లేదా తీసుకుంటాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: సమాధానము మీ అంపైర్ గా ఉండును గాక. మీకు సమాధానము ఉన్నప్పుడు మీ నిర్ణయం “ఇన్” అని మరియు మీరు లేనప్పుడు “అవుట్” అని తెలుసుకోండి.