
కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము! —కీర్తనలు 34:14
మన సమాధానమును పోగొట్టుకొనుటకు కారణమేమిటి? అనేక విషయాలు అనగా – ఆలస్యముగా నడచుట, ట్రాఫిక్ లో చిక్కుకొనుట, కాఫీ ఒలికి పోవుట … అందుకే ప్రతిరోజూ సమాధానముతో నడచుటలో “అభ్యాసం” చేయుట చాల ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు, మీరు నోరు మూసుకొనవలెనని నిర్ణయించుకొనుట లేక త్వరగా మనస్తాపం చెందకుండా ఉండుట మంచిది. ఒకవేళ తప్పు సమయాల్లో కూడా మీరు సర్దుకుపోవాలి.
మీరు కేవలం వెనక్కి వాలి కూర్చుని సమాధానము కొరకు ఆశించవద్దు, సాతానుడు మిమ్మును విడిచి పెట్టి వెళ్ళాలని ఆశించండి, లేక మీరు కోరినది వారు చేయునట్లు ఆశించండి. బైబిల్ మనకు చెప్తున్నదేమనగా ఉత్సాహముగా సమాధానమును వెదకండి. సమాధానము కొరకు ఆశించునట్లు మీ మనస్సును మీరు సిద్ధపరచుకొనవలెను.
మన జీవితములలో దేవుని వాక్యము ఫలము ఫలించునట్లు, సమాధానము కొరకు పని చేయుచు వెంటాడే వారి సమాధానకరమైన హృదయాలలో అది విత్తబడవలెను. సకల విశ్వాసులు సమాధానకరమైన ఆత్మను కలిగియుండ వలసిన బాధ్యత ఉన్నది తద్వారా వారిలో, వారి ద్వారా దేవుడు తన మాటను విస్తరింప జేయగలడు.
మీరు మీ జీవితములో గొప్ప మార్పును ఆశిస్తున్నారు కానీ మీరెంత ప్రయత్నం చేసిన అది మీ జీవితంలో రావడం లేదా? మీరు సమాధానములో జీవించుట లేదు కాబట్టి బహుశా అది మీ జీవితములోనికి రావడం లేదేమో. కాబట్టి, మీరు సమాధానముకొరకు ఆశించమని, వెదకమని మరియు మీ శక్తి అంతటితో దానిని వెంటాడుమని మిమ్మును ప్రాధేయ పడుచున్నాను!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నాకు సమాధానము దానంతట అదే వచ్చునట్లు కేవలం వెనక్కి వాలి కూర్చొని వేచి యుండలేను. నేను ఉత్సాహముగా దానిని పొందుకుంటాను. మీ సమాధానమును వెంటాడుటను చూపించుము.