
దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక. (కీర్తనలు 85:8)
దేవుడు మాట్లాడేటప్పుడు, మనము వినే ఆయన వాక్యము నిజముగా ఆయన నుండి వస్తుందని మనము నిశ్చయత పొందునట్లు మనలో అంతర్గత సమాధానమును మనకు అనుగ్రహించును. ఆయన మనల్ని ఖండించటానికి మాట్లాడినప్పటికీ, సత్యమైన ఆయన ఆత్మ మన ఆత్మలకు ప్రశాంతమైన ఓదార్పునిస్తుంది
మన శత్రువైన మోసగాడు, మనతో మాట్లాడుతాడు, అతడు మనకు సమాధానమునివ్వడు. మన స్వంత ఆలోచనలతో సమస్యలను పరిష్కరించాలనుకుంటే, మనకు సమాధానము రాదు, ఎందుకంటే, “శరీరానుసారమైన మనస్సు యున్నది (పరిశుద్ధాత్మ లేని జ్ఞానము మరియు ఆలోచన) మరణము [ఇక్కడ మరియు ఇకపై పాపం నుండి ఉత్పన్నమయ్యే అన్ని బాధలను కలిగి ఉన్న మరణం]; (పరిశుద్ధ) ఆత్మానుసారమైన మనస్సు (ఇప్పుడు మరియు ఎల్లప్పుడు) జీవమును సమాధానమునైయున్నది.” (రోమీయులకు 8:6).
దేవుడు మాట్లాడాడని మీరు విశ్వసించినప్పుడల్లా లేదా ఆయన చెప్పినట్లు మీరు విశ్వసించే దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటే, సమాధాన స్థాయిని ఉపయోగించండి. మీరు వినిన మార్గనిర్దేశానికి వ్యతిరేకంగా సమాధానము తన ఉనికిని నిలుపుకోలేకపోతే, దానితో కొనసాగకండి. మీరు దాని గురించి ఎందుకు సమాధానమును కలిగియుండరనే విషయాన్ని ఇతరులకు వివరించాల్సిన అవసరం లేదు; అది కూడా మీకు తెలియకపోవచ్చు. మీరు కేవలం ఇలా చెప్పవచ్చు, “దీని గురించి నాకు ప్రస్తుతం సమాధానము లేదు; కాబట్టి, నేను దానితో ముందుకు వెళ్లడం తెలివైన పని కాదు.”
దేవుడు మీకు సూచించినట్లు మీరు భావించే దాని గురించి సమాధానకరమైన మీ ఆత్మను నింపే వరకు ఎల్లప్పుడూ వేచి ఉండండి. సమాధానము అనేది మీరు నిజంగా దేవుని నుండి వింటున్నారని మరియు దానికి అనుగుణముగా పని చేయుట మీ సమయం సరైనదని నిర్ధారించడం. సమాధానము మనకు విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తుంది, ఇది దేవుని సూచనలకు విధేయత చూపేలా చేస్తుంది.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు క్రియ చేయుటకు ముందు సమాధానము కొరకు వేచియుండుము.