కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. (యాకోబు 4:8)
దేవునికి సమీపముగా ఉండుటకు అవసరమైన వెల చెల్లించుటకు ప్రతివారూ అనుకూలముగా లేరు. ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన సమయం తీసుకొనుటకు మరియు అవసరమైన పెట్టుబడులు చేయుటకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా లేరు. దేవుడు మన సమయాన్ని అంతా ఇవ్వమని అడగడు. మనం “ఆత్మీయం”గా భావించని పనులు చేయాలని ఆయన ఖచ్చితంగా కోరుకుంటున్నాడు. ఆయన మనలను శరీరాలు, ప్రాణములు (మనస్సులు, సంకల్పాలు మరియు ఉద్రేకములు) మరియు ఆత్మలతో రూపొందించాడు మరియు ఈ రంగాలన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు.
మన శరీరములకు అభ్యాసం చేయడం మరియు మన ప్రాణములకు శ్రద్ధ తీసుకొనుటకు సమయం మరియు కృషి అవసరము. మన భావోద్వేగాలను పరిచర్య చేయాలి; ఆనందం ఉండాలి మరియు వినోదం కూడా ఉండాలి మరియు ఇతర ప్రజలతో కలిసి ఉండుటలో ఆనందించాలి. మన మనస్సులు అనుదినము ఎదగాలి మరియు నూతన పరచబడాలి. దానితో పాటుగా, ధ్యాసనుంచవలసిన ఆత్మీయ స్వభావమును మనము కలిగి యుండవలెను. సమతుల్యముగా మరియు ఆరోగ్యకరముగా ఉండాలంటే, మన సంపూర్ణ జీవితమును గురించి శ్రద్ధ తీసుకొనుటకు సమయం తీసుకోవాలి.
దేవునితో సన్నిహిత సంబంధము యొక్క సమస్య అంతా సమయమేనని నేను నమ్ముతున్నాను. దేవునిని వెదకటానికి మనకు సమయం లేదని అంటాము, కానీ సత్యమేదనగా, మనకు బాగా ప్రాముఖ్యమైన విషయాల కొరకు సమయాన్నిస్తాము. మనమందరము ప్రతిరోజూ అడ్డంకులతో పోరాడవలసి యుండగా, దేవునిని తెలుసుకోవడం మరియు ఆయన నుండి వినడం మనకు ముఖ్యమైనది అయినప్పుడు అది చేయడానికి మనకు సమయం దొరుకుతుంది. దేవుని పనిని మీ వేళాపట్టికలో (షెడ్యూల్) చేయకండి కానీ ఆయనతో మీ వేళాపట్టికను (షెడ్యూల్) కలిపి దాని ప్రకారము పని చేయండి.
దేవునిని గురించి తెలుసుకొనుట అనునది సుధీర్ఘ కాల పెట్టుబడి, కానీ మీరు తక్షణ ఫలితాలను పొందుకోకపోతే నిరాశ పడవద్దు. మీ సమయంతో మీరు దేవునిని ఘనపరచుటకు నిర్ణయించుకోండి మరియు మీరు ప్రయోజనములను పొందుకుంటారు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: శారీరక వ్యాయామము వలె, అనుదినము ఆత్మీయ వ్యాయామము అవసరం. ఫలితాలు మీరు ఖచ్చితముగా చూస్తారు.