సరియైన జ్ఞానమును అనుసరించుట

సరియైన జ్ఞానమును అనుసరించుట

 నేను, యేసుక్రీస్తును అనగా, (ఏమీ తెలియకుండా, ఏమి జ్ఞానం ప్రదర్శించకుండా మరియు దేని కొరకు ప్రయత్నించక) సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.   —1 కొరింథీ 2:2

అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యమును వెదకుకుండా శరీర సంబంధమైన జ్ఞానము కొరకు వేదకుచున్నారు. నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారని దేవుడె మనతో చెప్పి యున్నాడు … (హోషేయ 4:6).

లోక జ్ఞానమనే సంపదతో పౌలు విద్యావంతుడై యున్నాడు. అతడు తనను గురించి తాను ఇతరుల కంటే ఉత్తమముగా ఆలోచిస్తూ క్రైస్తవులను చంపుటకు వెదకుచున్నాడు. కృతజ్ఞతా పూర్వకముగా, దేవుడు తాను ఇతర ప్రణాళికలను కలిగి యున్నాడు మరియు అతని జీవితము పూర్తిగా మార్చబడునట్లు పౌలు యొక్క మార్గములో తనను తాను ప్రత్యక్ష పరచుకున్నాడు.

లోకజ్ఞానం కోరుతూ ఆత్మీయ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతకు పోల్చలేమని పౌలు గ్రహించినప్పుడు, అతను దానిని అనుసరించాలని మాత్రమే నిర్ణయించుకున్నాడు.

పౌలులాగే మనం కూడా ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడంలోని ప్రాముఖ్యతను గ్రహించాలి. లోక విషయాలను కోరుకోకుండా, మన మనస్సులో వాటిని నింపుటకు బదులు, మనము చదివి అధ్యయనం చేయాలి, ధ్యానం చేయాలి మరియు దేవుని వాక్యముతో మన మనస్సులను నింపాలి.

దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం మీ జీవితాన్ని మారుస్తుందని నా అనుభవము నుండి నేను మీకు చెప్పగలను. అది ఇంతవరకు నివసించిన అతిగొప్ప క్రైస్తవులలో ఒకరిగా పౌలును మార్చుట మాత్రమే కాక, అది మిమ్మల్ని మార్చివేసి క్రీస్తులో మీ అద్భుతమైన గమ్యమునకు దారి తీస్తుంది.

దేవుని వాక్యంలో ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నేడు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ హృదయాలలో మరియు మీ మనస్సులో ఎక్కువగా దేవుని వాక్యము మీరు నిజంగా శోధిస్తున్న దానిని కనుగొనటానికి సహాయపడుతుంది.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, అనవసరమైన లోకజ్ఞానము కొరకు నా సమయమును వ్యర్ధపరచాలని నేను ఆశించుట లేదు. పౌలు వలె, మిమ్మలని మరియు మీ వాక్యములో కనుగొనే ఆత్మీయ జ్ఞానమును పొందుకొనుటకు మీరు నాకు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon