సవాళ్ళను ఒకరోజు ఒకేసారి తీసుకోండి

సవాళ్ళను ఒకరోజు ఒకేసారి తీసుకోండి

నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.    – యెహోషువా 1:9

మీ సవాళ్ళను మీరు ఒకే సమయంలో ఒకేరోజు తీసుకోవాలని నేను మిమ్మును బలముగా ప్రాదేయపడుచున్నాను. రహదారిని చాల దూరం నుండి చూస్తున్నపుడు మనకు సరిగా కనపడదు. దేవునిని నమ్ముట అనగా దేవుడు మనకు అనుదిన ఆహరమును అనుగ్రహించునని దేవుని యందు నమ్మిక యుంచవలెను; అనగా మనకు లేని దానిని మరియు మనకు అవసరమైన దానిని మనము పొందుకుంటాము.

కొన్నిసార్లు సవాళ్ళు మనకు చాలా అసాధ్యముగా ఉండవచ్చు, కానీ దేవుడెల్లప్పుడు మనతో ఉంటాడు. మనము కేవలం ధైర్యమును కలిగి యుండవలెను మరియు ఆయన ఇచ్చే బలమును పొందుకొనవలెను. ఈరోజు మీకేది అవసరమో దానిని చేయుటకు దేవుడు మీకు కృపను అనుగ్రహించునని జ్ఞాపక ముంచుకోండి తద్వారా మనము రేపటి గురించి చింతించుట కంటే ఆ క్షణములో జీవించుటపై దృష్టిని నిలుపుట ప్రాముఖ్య మైనది.

ఈ సూత్రము మన జీవితములో అనేక ఇతర ప్రాంతాలలో అనగా – అప్పుల నుండి బయట పడుట, ఇంటిని శుభ్రపరచి సర్ది పెట్టుట, వివాహ సమస్యలను పరిష్కరించుట, మీ బిడ్డలను క్రమశిక్షణలో, సమయానికి పనికి వెళ్ళుట లేక ప్రాజెక్ట్ ను పూర్తి చేయుట వంటి వాటికి కూడా వర్తిస్తుంది. మీరు మీ జీవితములో దేనిని చేయవలసి వచ్చినా, మీరు దానిని చేయగలరు.

ఫిలిప్పి 4:13  మనకు తెలియజేయునదేమనగా దేవుడు మీకు బలమును అనుగ్రహించును గనుక మీరు దేనికైనా సిద్ధమే మరియు దేనికైనా సమానమే. ఆయన మీ పక్షమున ఉన్నప్పుడు మీకు ఏదియు అసాధ్యము కాదు.


ప్రారంభ ప్రార్థన

దేవా, ఒకవేళ నా యెదుట ఉన్న సవాళ్ళు నాకు అసాధ్యముగా ఉన్ననూ మీరు నాతో ఉన్నారు కనుక నేను వాటిని ఎదుర్కొనగలను. ఈరోజే నేను మీ బలమును పొందుకొనుచున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon