సహాయం!

సహాయం!

నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను! (యెషయా 41:13)

మనం మన జీవితాలను ఎంత బాగా నడిపిస్తున్నామని అనుకున్నా, ప్రతి విషయంలోనూ మనకు సహాయం కావాలి అనేది నిజం. మన దైనందిన జీవితంలో మనకు అన్ని రకాల సహాయం కావాలి. తరచుగా, మనకు ఎంత సహాయం అవసరమో గ్రహించడానికి చాలా సమయం పడుతుంది. మనము స్వతంత్రంగా మరియు సహాయం లేకుండా చేయవలసినది చేయగలమని నమ్ముతాము. అయితే, ప్రభువు మనకు ఒక దైవిక సహాయకుడిని పంపాడు; కాబట్టి, మనకు సహాయం కావాలి. దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు యేసు స్వయంగా మన కొరకు నిరంతరం మధ్యవర్తిత్వం వహిస్తాడు (హెబ్రీయులు 7:25; రోమీయులకు 8:34 చూడండి), మరియు అది మన జీవితాలలో దేవుని జోక్యం కలుగ జేసికొనుట మనకు నిరంతరం అవసరమని చెబుతుంది. మనము నిజముగా చాలా అవసరతలో ఉన్నాము మరియు పూర్తిగా మన స్వంత జీవితాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాము.

మనం కొంతకాలం పాటు మనల్ని మరియు మన జీవితాలను చక్కగా నిర్వహించుకుంటున్నట్లు అనిపించినప్పటికీ, దైవిక సహాయం పొందకుండా మన స్వంత శక్తితో జీవిస్తున్నట్లయితే, ముందుగానే లేదా తరువాత ఏదో జరుగుతుంది మరియు విషయాలు విచ్ఛిన్నమవుతాయి.

చాలా సార్లు, ఇబ్బంది వచ్చే వరకు మనము బాగానే ఉంటాము. ఇది విచ్ఛిన్నమైన వివాహం, ప్రియమైన వ్యక్తి మరణం, ఉద్యోగం కోల్పోవడం లేదా మనకు ముఖ్యమైన మరేదైనా రూపంలో రావచ్చు. కానీ చివరికి, మనమందరం మన అవసరాన్ని గుర్తించాల్సిన స్థితికి చేరుకుంటాము.

మనం జీవితాన్ని దేవుడు ఉద్దేశించిన విధంగా జీవించాలనుకుంటే-నీతి, సమాధానము మరియు ఆనందంతో నిండి ఉండాలంటే (రోమీయులకు 14:17 చూడండి), మనకు సహాయం అవసరమని మనం అంగీకరించాలి మరియు మనకు సహాయం చేయుటకు దేవుడు పంపిన పరిశుద్ధాత్మ నుండి పొందాలి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: సహాయం కొరకు నీ అవసరతను తెలియజేయండి మరియు మీకు సహాయం చేయుటకు పరిశుద్దత్మ యందు నమ్మిక యుంచండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon