ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. —ద్వితీయోపదేశ కాండము 10:18
ఎవరైనా ఒకరు బాగా అవసరతలో ఉన్నప్పుడూ చూస్తూ ఏమి సహాయపడకుండా ఉండటం పూర్తిగా తప్పు. నన్ను వివరించనివ్వండి…
కొద్ది కాలం క్రితం, ప్రభువు నాకు హింసించబడుతున్న వారికి న్యాయం చేయమని బలముగా నాకు వెల్లడించియున్నాడు. అది క్రీస్తు శరీరంలోని అందరికి ఆయన పిలుపులో భాగం. ఆయన పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రములో ఇచ్చిన ప్రకారము ఆయన తండ్రి లేనివారికి, విధవరాండ్రకు, అణచివేయబడిన, పేద, ఒంటరి మరియు మరువ బడిన, సహాయం కోసం చూస్తున్న వారికి సహాయపడే వారి కొరకు చూస్తున్నాడు.
దేవుడు మోషేతో మాట్లాడుతూ ‘విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు’అని చెప్పాడు (నిర్గమ కాండము 22:22). ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు (ద్వితీయోపదేశ కాండము 10:18). అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్య మైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురని దేవుడు వారితో చెప్పియున్నాడు (ద్వితీయోపదేశ కాండము 14:29 చూడండి).
ఈరోజు అత్యంత విడువబడిన మరియు ఒంటరి ప్రజలు ఎవరనగా బ్రతుకుదెరువు కోసం బలవంతముగా వ్యభిచార వృత్తిలోనికి దించబడిన బాలికలు, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన తల్లిదండ్రుల పిల్లలు, ప్రతిరోజూ ఒంటరిగా జైళ్ళలో బ్రతుకుచున్న వారు, గృహాలు లేక వీధుల్లో జీవిస్తున్న ప్రజలు …. వంటి అనేక మంది ప్రజలూ అవసరతలో ఉన్నారు.
ఇది అన్నింటికన్నా పెద్దది అనిపించవచ్చు, మరియు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను దీని గురించి ఏమి చేయవచ్చు? నేను ప్రతిదీ పరిష్కరించలేకున్నా, నేను కేవలం ఒక వ్యక్తి యొక్క బాధను ఉపశమనం చేస్తే, నేను ఒక వ్యత్యాసాన్ని చేస్తున్నాను అని దేవుడు నాకు నేర్పించాడు.
దయచేసి మీరు ఇవ్వాల్సినది సరిపోదు అని అనుకోకండి. గాయపడిన, విరిగిన, ఆకలితో మరియు నిరాశ్రయులందరూ మీ చుట్టూ ఉన్నారు. మీరు ఈరోజు వారికి సహాయం చేస్తారా?
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, మీరు బీదవారికి మరియు ఒంటరిగా ఉన్నవారికి స్పష్టముగా సహాయపడుతున్నారు. మీ హృదయాన్ని మాకివ్వండి మరియు నేను సహాయపడవలసిన గాయపడిన మరియు విరిగిన మనుష్యులకు న్యాయం చేయునట్లు వారిని నాకు చూపించుము.