
ఎల్లప్పుడును ప్రభువునందు (ఆయనలో మీరు సంతోషించండి) ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడీ! —ఫిలిప్పీ 4:4
మానసిక ఒత్తిడి యొక్క నిర్వచనములో ఒక భాగమేదనగా “ఒక ఖాళీ; నిమ్న స్థితిలో ఉండుట; విచారము, తృణీకరణ స్థితిలో ఉండుట. మానసిక ఒత్తిడికి సాధారణ కారణము మనమెక్కడ ఉన్నామో లేక మన పరిస్థితులు కాదు కానీ మనలను మనము ఎక్కడ కనుగొంటామనే వైఖరియై యున్నది. అందుకే మీరు యోగ్యులుకారని మరియు తృణీకరించబడిన వారని మీరు భావించునట్లు దయ్యము చేస్తాడు.
కానీ మీరు సంతోశపడునట్లు సాతానుడు చేసే దానిని అనుమతించకుండా ఉన్నట్లయితే అప్పుడు వాడు మిమ్మును బాధపెట్టడు; మరియు అతడు మిమ్మును బాధపెట్టకుండా ఉన్నట్లయితే మీరు నిరాశ చెందరు.
సాతానుని ఎదిరించుటకు మరియు విజయమును పొందుటకు ఉత్తమ మార్గములలో ఒకటి ఎదనగా మిమ్మల్ని ఆనందములో నడిపించునట్లు పరిశుద్ధాత్మ దేవునిని అనుమతించుటయే. శత్రువు మిమ్మును ప్రతికూలతలోనికి నడిపించి జాలిపడుతూ సంతోషిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును అనుకూలత వైపునకు నడిపిస్తూ వేడుక జరుపు కొనుటకు నడిపిస్తాడు!
ఫిలిప్పీ 4:4 లో ఎల్లప్పుడూ ఆనందించమని చెప్తుంది. మనము దేవుని మీద దృష్టిని నిలిపినప్పుడు, ఆయనలో ఆనందించండి, మనలో నిరాశకు స్థానం లేదు! కాబట్టి తరువాత శత్రువు మిమ్మల్ని తక్కువగా లేక విచారముగా ఉండునట్లు అనుమతించినట్లైతే, ప్రభువులో ఆనందించుట నేర్చుకోండి!
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు అద్భుతకరుడు మరియు ఆశ్చర్యకరుడవు గనుక నేను నీలో ఎల్లప్పుడూ ఆనందించుదును. నీతో నేను నింపబడి యున్నాను గనుక నిరాశకు నాలో స్థానం లేదు!