
లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై [అయన ప్రారంభానికి వ్యతిరేకంగా-పాతుకుపోయిన, స్థాపించబడిన, బలమైన, స్థిరమైన మరియు నిశ్చయమైన] వానిని ఎదిరించుడి. —1 పేతురు 5:9
దేవుడు మీ కొరకు కలిగియున్న గొప్ప మరియు బలమైన కార్యములను ఆశించియున్నట్లైతే, అప్పుడు మీరు ప్రతికూల మనస్సు అనే వేరుల యొద్దకు వెళ్లి వాటితో వ్యవహరించవలెను. వేరులు తొలగించబడని యెడల, అవి ఒక చెడ్డ ఫలము తరువాత మరియొక దానిని ఉత్పత్తి చేస్తాయి.
చాల తరచుగా మనము చెడ్డ ఫలమనే మన వైఖరితో వ్యవహరిస్తూ ఉంటాము, కానీ మనమెప్పుడూ సమస్యను తొలగించునట్లు ఆ వెరుల లోతునకు వెళ్ళము. లోతుగా త్రోవ్వుట ద్వారా చెడ్డ వేరును తొలగించుట బాధాకరమైన విషయమే, కానీ సమస్యను పెకిలించుటకు ఇది ఒకటే మార్గము. సరియైన దానిని చేయుట ద్వారా మార్పు అనే బాధను అనుభవించుట లేక మనము సాతాను యొక్క పధకములో ఉండుట ద్వారా ఆ భాధలోనే నిలిచి యుండుట. అతని లక్ష్యమేదనగా మీరు మీ పాత అలవాటులలో నిలిచి యుండి బాధ పడుటయే.
మీరు విశ్వాసమందు స్థిరులై సాతాను పధకాలను త్రిప్పి కొట్టాలని పేతురు మనకు చెప్తున్నాడు (1 పేతురు 5:8-9 వరకు చూడండి). మీరు అనుభవించే బాధ మిమ్మును దేవుని మహిమ అనే నూతన అనుభవములోనికి నడిపించాలని లేక మీరు గత బాధను కలిగి యుండి మీ జీవితములో చెడ్డ ఫలములను ఫలించవలెనని ఆశిస్తున్నారనే విషయాలను మీరు నిర్ణయించుకోవాలి.
సాతాను పధకాలను త్రిప్పికొట్టండి మరియు దేవుడు మీ కొరకు ఏర్పరచిన ప్రణాళిక వద్దకు పరిశుదాత్మతో నడవండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, సాతానుడి ప్రణాళికలను త్రిప్పి వేయుటకు మీ సహాయం నాకు కావాలి. చెడ్డ వేరులు పెరికి వేయుట బాధకరమైనదే కానీ అది నన్ను మీకు సమీపముగా తీసుకొని వస్తే, నేను దానిని చేయాలని ఆశిస్తున్నాను. నేను సాతానుని ఎదిరిస్తుండగా, మిమ్మల్ని అనుసరించుటకు నన్ను నేను మీకు సమర్పించుకొనుచుండగా నన్ను బలపరచుము.