ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. —సామెతలు 2:7-9
జీవిత రహదారిలో మీ ప్రయాణం మధ్యలో మీకు ఆత్మీయ గుర్తులు కనపడతాయి. దేవుని భద్రతా నీడలో ఉండునట్లు చింతించవద్దు దేవుని యందు నమ్మిక యుంచుము అనే గుర్తులకు మీరు విధేయత చూపవలెను. భయపడవద్దు; ధైర్యముగా ఉండుము. మీరు ఈ గుర్తులకు విధేయత చూపినట్లైతే మీరు సులభముగా మీ పనిలో నిలిచి యుండవచ్చును. మీరు దేవుడు మాత్రమే అనుగ్రహించే భద్రతను, సమాధానమును మరియు ఆనందమును అనుభవించగలరు.
ఏది ఏమైనప్పటికీ, మీరు సూచనలను గుర్తించుటలో విఫలమైతే మీ మార్గము ఎప్పటికీ తిన్నగా ఉండదు మరియు మీరు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసమును కలిగి యుండలేరు. మీరు యెరుగని విషయాలను గురించి వేచియుంటూ మార్గములో ముందుకు వెళ్ళలేక చాలా చింతిస్తూ గడుపుతారు.
మీరు మరియు నేను దేనిని గురించి చింతపడనవసరం లేదు ఎందుకనగా దేవుడు మన మార్గములను కాయును మరియు మన మార్గమును దాచి యుంచును. మనకు ఎటువంటి పరిష్కారము లేకుండా ఉండగా ఆయన సూచనలను నిర్లక్ష్యము చేయుచు చింతించుట ఎందుకు?
విధేయతయనే వైఖరిని కలిగి యుండుము మరియు మీరు ఆయన సూచనలను చూసినప్పుడు వాటిని అనుసరించండి. మీరు ఆయన సూచనలను అనుసరించినప్పుడు మీరెప్పుడూ మీ గమ్యమునకు భద్రముగా చేరుతారు.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, జీవ మార్గమున మీరు ఉంచిన ఆత్మీయ గుర్తులను చూచుటకు నాకు సహాయం చేయండి. నేను వాటిని చూసినప్పుడు, నేను వాటికి విధేయత చూపుతాను మరియు నా జీవితములో భద్రముగా ఉండునట్లు నేను అనుసరిస్తాను.