సేద తీర్చుకోండి

సేద తీర్చుకోండి

ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు (మీ మనస్సు మరియు మీ ప్రణాళికలో మార్పు) నొంది తిరుగుడి. (అపోస్తలుల కార్యములు 3:19)

దేవుడు తన సన్నిధిని అనేక విధాలుగా వ్యక్తపరుస్తాడు. చాలా సమయాల్లో మనం ఆయనను చూడలేము, కానీ, గాలిలా, మనలో ఆయన చేసే పనిని మనం చూడగలం. నేను అలసిపోయినా, విసిగిపోయినా, నిరుత్సాహానికి గురైనా, ఏదో ఒక దాని గురించి బాధపడినా, దేవునితో గడిపిన తర్వాత నేను సేద తీరుతాను, అప్పుడు ఆత్మ యొక్క గాలి నాపై వీచిందని నేను తెలుసుకుంటాను.

దేవుడు మీ జీవితంలోకి తాజాదనాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. జవాబు మీలో నివసిస్తున్నప్పుడు మీ ఆత్మలో నిరాశ చెందకండి లేదా విసుగు చెందకండి. మీరు దేవునితో సమయం గడపడానికి చాలా బిజీగా ఉంటే, మీరు చాలా బిజీగా ఉంటారు, కాబట్టి మీ షెడ్యూల్‌లో కొన్ని సర్దుబాట్లు చేసుకోండి. మీకు సేదతీరే సమయాలు అందుబాటులో ఉన్నప్పుడు మండిపోయి, కలత చెందకండి, అలసిపోకండి మరియు ఒత్తిడికి లోనవకండి.

యేసు చేసిన విధంగా దేవునితో సమయం గడపడానికి జీవితంలోని బిజీ నుండి బయటపడటం నేర్చుకోండి. మీరు దేవునితో గడపవలసిన సమయాన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆమోదించే వరకు మీరు వేచి యుండకండి. మీరు చేయవలసినా దేమనగా భావించే పనిని ఎవరైనా ఎల్లప్పుడూ కనుగొంటారు! వీలైతే ఉదయం పూట మొదట సమయాన్ని కేటాయించండి మరియు రోజంతా అనేక “చిన్న ఆధ్యాత్మిక సెలవులు” తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేస్తున్న పనిని రెండు లేదా మూడు నిమిషాలు ఆపండి; మీరు విశ్రాంతి తీసుకోవడంలో సహాయపడేందుకు గాఢంగా ఊపిరి తీసుకోండి మరియు మీరు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఆయన మీకు ఎంత అవసరమో చెప్పండి. మిగిలిన సమయమంతా ఆయన సన్నిధి నిశ్శబ్దంగా ఉండండి మరియు మీరు అద్భుతమైన రీతిలో సేదతీర్చ బడతారు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మండిపోవద్దు లేదా ఒత్తిడికి గురికావద్దు; ప్రభువు సన్నిధిలో సేదతీరుటకు సమయాన్ని వెచ్చించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon