
ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి (నా శరీరమును సమాధిచేసి, లోక ఆకర్షణలను, శారీరక ఆకలిని, లోకాశలను చంపివేసి) నిర్దోషమైనదిగా (కదలకుండునట్లు మరియు నిందారహితముగా) ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను. – అపోస్తలుల కార్యములు 24:16
మీ మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుట చాలా క్లిష్టమైనది ఎందుకంటే ఎంతగా అపరాధ భావన ఉంటే అంతగా నీవు జీవితాన్ని ఆనందించ లేవు.
అపోస్తలుల కార్యములలో, పౌలు తాను క్రమశిక్షణను అనుసరించాడని, మరియు ఆయన దేవుని ముందు నేరారోపణ మరియు అపరాధ భావన లేకుండా చేయగలిగే విధంగా లోక కోరికలను తప్పించాలని చెప్పాడు. అదే మనకు కూడా వర్తిస్తుంది. స్పష్టమైన మనస్సాక్షియనే ఆత్మ విశ్వాసములో నడుస్తున్నట్లైతే మనము స్వేచ్ఛగా, సంతోషంగా ఉండగలము.
అది స్పష్టమైన, సరియైన మరియు తప్పు సమస్యల విషయానికి వస్తే సులభంగా ఉంటుంది, కానీ “బూడిద” ఉన్న ప్రాంతాల సంగతి ఏమిటి? సరైన లేదా తప్పు ఎంపిక ఏమిటనేది మనకు తెలియకుంటే మన మనస్సాక్షి ఎలా ఉంటుందో మనకెలా తెలుస్తుంది? మనం దానిని గ్రహించకుండా పాపం చేస్తే ఏమి జరుగుతుంది? దేవుని వివేచన ఈ సమస్యను పరిష్కరిస్తుందని నేను కనుగొన్నాను.
వివేచన అనునది ఆత్మీయ అవగాహన మరియు అది స్పష్టమైన మనస్సాక్షితో జీవించుటకు ఒక తాళపు చెవియై యున్నది. దానికి అభ్యాసం అవసరం, కానీ ఇది కేవలం మీ హృదయము వైపు ధ్యాస నుంచుటతో ఇమిడి యున్నది. మీకు అపరాధ భావన కలిగించేది ఏదైనా చేయని యెడల దేవుడు మీకు తెలియజేస్తాడు.
మీ మనసాక్షి స్పష్టముగా ఉండునట్లు చేయు మార్గములో నీవు జీవించాలని మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. మీరు చేయకూడని పనులను తెలిసి కూడా చేయవద్దు మరియు మీరు ఖచ్చితముగా తెలియని విషయాలలో దేవుని జ్ఞానము కొరకు అడగండి. ఆయన మిమ్మును ఎన్నడూ తప్పు త్రోవలో నడిపించడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ వివేచనను బట్టి మీకు వందనములు. మీరు నా హృదయముతో మాట్లాడే మెల్లనైన సన్నని స్వరము వైపు చెవియొగ్గుటకు నాకు సహాయం చేయండి ఎందుకంటే తద్వారా నా మనస్సాక్షి మీ ఎదుట స్వేచ్ఛగా మరియు స్పష్టముగా ఉండునట్లు నేను జీవించగలను.