ఆత్మచే నడిపించబడండి

ఆత్మచే నడిపించబడండి

మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము [పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునిలో మన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆత్మచే నియంత్రించబడే మన ప్రవర్తనలో నడుస్తూ ముందుకు వెళ్దాం.] (గలతీ 5:25)

నేటి వచనం, ఆత్మ ద్వారా జీవించడం మరియు నడవడం గురించి మాట్లాడుతుంది, అవి ఆత్మచే నడిపించబడుతున్నాయి. మనల్ని నడిపించడానికి చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి- ఆవేవనగా ప్రజలు, దెయ్యం, శరీరము (మన స్వంత శరీరాలు, మనస్సులు, చిత్తాలు లేదా భావోద్వేగాలు) లేదా పవిత్రాత్మ. ప్రపంచంలో మనతో మాట్లాడే అనేక స్వరాలు ఉన్నాయి మరియు తరచుగా ఒకే సమయంలో అలా మాట్లాడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా ఎలా నడిపించబడాలో మనం నేర్చుకోవడం అత్యవసరం. గుర్తుంచుకోండి: ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు మరియు మనలో ప్రతి ఒక్కరిలో నివసించడానికి పంపబడ్డాడు, దేవుడు మనల్ని రూపొందించాడు మరియు ఆయన ఆశించిన సమస్తమును కలిగి ఉండటానికి మనకు సహాయం చేస్తాడు.

పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడానికి మనలో నివసిస్తున్నాడు. ఆయన సహాయం మొదట ఎల్లప్పుడూ స్వాగతించబడకపోవచ్చు, కానీ, దేవునికి ధన్యవాదాలు, ఆయన పట్టుదలతో ఉన్నాడు మరియు మనలను వదులుకోడు. మనం ప్రతిరోజూ మన జీవితాన్నంతటినీ ఆయన సన్నిధిలో ఎత్తిపడుతూ, “పరిశుద్ధాత్మా, నా జీవితంలోని ప్రతి ప్రాంతంలోనూ నీకు స్వాగతం!” అని మన శక్తితో చెప్పాలి.

మీరు మీ జీవితంలోని ప్రతి ప్రాంతంలో పరిశుద్ధాత్మను స్వాగతించినప్పుడు, ఆయన వస్తాడు. ఆయన మీతో మాట్లాడతాడు, మీకు మార్గనిర్దేశం చేస్తాడు, మిమ్మల్ని సరిదిద్దాడు, మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు మరియు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇతర శక్తులు మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ వాటిని ఎదిరించే శక్తిని మీకు అనుగ్రహిస్తాడు మరియు మీరు ఆయనను అనుసరించేలా చేస్తాడు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారో మీరే ప్రశ్నించుకోండి. ఇది మీరా, ఇతర వ్యక్తులా, భావోద్వేగాలా, సాతానా యొక్క అబద్ధాలా, లేదా పరిశుద్ధత్మా?

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon