ఋణము నుండి స్వేచ్చగా జీవించుట

ఋణము నుండి స్వేచ్చగా జీవించుట

ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు….  —రోమా 13:8

మన ఆర్ధిక పరమైన యుద్ధములు నిజముగా ఆత్మీయ యుద్ధములేనని మనము గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనది. మనం వెచ్చించలేని దాని కంటే ఎక్కువగా ఖర్చు పెట్టునట్లు మనల్ని అపవాది శోధిస్తూ దేవునితో మన నడకలో మనల్ని తప్పటడుగులు వేయునట్లు పురికొల్పును.

యేసు మన కొరకు మరణించి – నీతి, సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమును కలిగి యుండునట్లు – యేసు మన కొరకు మరణించి అనుగ్రహించిన జీవితమును ఆనందించుటయే మన లక్ష్యముగా మనము కలిగి యుండవలెను. మనము ఆర్ధిక రుణ  విషయాల్లో ఒత్తిడి మరియు విసుగు చెందియున్నట్లైతే మనము దీనిని చేయలేము.

డబ్బు వ్యవహరించుటలో లేఖనపరమైన సూత్రములను ఉపయోగించుట ద్వారా రుణ విముక్తులుగా జీవించుటకు ఇది సాధ్యమే. నా భర్త డేవ్ ఇలా చెప్తున్నాడు, మన సరిహద్దులలో లేక మన ఆదాయములో మనము జీవించుచున్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సరిహద్దులను విశాలపరుస్తాడు మరియు మనము అధిక ఆశీర్వాదములను పొందుకుంటాము. లూకా 19:17లో మనము చిన్న విషయాల్లో నమ్మకముగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు. మనమలా చేసిన యెడల అయన మనకు గొప్ప విషయాలను అనుగ్రహిస్తాడు.

కాబట్టి మీకు దేవుడు చేయమని ఇచ్చిన దానిలో నమ్మకముగా ఉండకుండా “పెద్ద” విషయాలలో పని చేయుటయనే వలలో పడవద్దు. మీ సరిహద్దులలో నివసిస్తూ రుణ విముక్తులుగా జీవించండి… అప్పుడు వాటిని దేవుడు విశాలపరచుట మీరు చూస్తారు.

ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నా ఆర్ధిక విషయాల్లో ఎదుర్కొనే ఆత్మీయ యుద్ధములో విజయం సాధించాలని ఆశిస్తున్నాను కాబట్టి, నేను రుణములో జీవించుటకు నిరాకరిస్తున్నాను. నేను కలిగి యుండని దానిని ఖర్చు చేయునట్లు శోధింపబడను.  బదులుగా, మీరు నాకు అనుగ్రహించుట సరిహద్దులలో నమ్మకముగా ఉంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon