దేవుడు మనలని మృధువుగా నడిపిస్తాడు

దేవుడు మనలని మృధువుగా నడిపిస్తాడు

గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును. (యెషయా 40:11)

దేవుడు మనతో మాట్లాడినప్పుడు మరియు మనల్ని నడిపించినప్పుడు ఆయన మన మీద కేకలు వేస్తూ తాను ఆశించిన మార్గములో మనం నడవాలని బలవంతముగా నెట్టడు. కాదు, ఆయన మనలను ఒక సున్నితమైన గొర్రెల కాపరిలా నడిపిస్తాడు, పచ్చిక బయళ్లకు తనను అనుసరించమని ఆహ్వానిస్తాడు. మనం ఆయన స్వరానికి చాలా సున్నితంగా ఉండే స్థాయికి చేరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు, “ప్రభువా, మీరు ఇక్కడ ఏమి చెప్తున్నారు?” అని మనం అడగడానికి ఒక చిన్న హెచ్చరిక కూడా సరిపోతుంది. మనం చేసే పనిని మార్చమని ఆయన మనల్ని నిర్దేశిస్తున్నాడని మనం గ్రహించిన వెంటనే, మనం వెంటనే ఆయనకు విధేయత చూపాలి. మనం చేస్తున్న పనికి సంబంధించి శాంతి / సమాధానము లోపమని మనం భావిస్తే, మనం ఆగి, ఆయన దిశానిర్దేశం కోసం దేవుణ్ణి వెతకాలి.

సామెతలు 3:6 ఇలా చెప్తుంది, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. దేవునికి అప్పగించడం అంటే ఆయన పట్ల తగినంత గౌరవం, తగినంత భక్తి భయం మరియు ఆయన పట్ల స్తుతిభావము, మన ప్రతి కదలిక గురించి ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకోవడం.
ప్రతిరోజూ ఒక మంచి మార్గములో దినమును ప్రారంభించుటకు ఇలా ప్రార్ధించండి:

“ప్రభువా, మీరు దేనిని గురించి ఆలోచిస్తున్నారో నేను శ్రద్ధకలిగి యున్నాను మరియు మీరు నేను చేయకూడదనుకునే పనులు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఈరోజు మీరు చేయకూడదనుకునే ఏదైనా చేయడం మొదలుపెడితే, దయచేసి అది ఏమిటో నాకు చూపించండి, తద్వారా నేను దానిని ఆపగలను, దాని నుండి దూరంగా ఉండగలను మరియు బదులుగా నీ చిత్తాన్ని చేయగలను. ఆమెన్.”


ఈరోజు మీ కొరకు దేవుని మాట: అన్నింటికంటే దేవుడు ఏమనుకుంటున్నాడో దాని గురించి ఎక్కువ శ్రద్ధ వహించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon