అందుకు యోహాను ఇట్లనెనుతనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని [అతను ఏదీ పొందుకోలేడు, తనకు తాను ఏమీ తీసుకోలేడు]యెవడును ఏమియు పొంద నేరడు. [ఒక వ్యక్తి తనకు పరలోకము నుండి ఇవ్వబడిన వరమును స్వీకరించడానికి సంతృప్తి చెందాలి; వేరే మూలం లేదు.] (యోహాను 3:27)
ఆత్మీయ వరములు, సహజ సామర్థ్యాలు మరియు వారి జీవితాలపై దేవుడు ఉంచిన పిలుపుల విషయంలో ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడినప్పుడు లేదా ఇతరులతో తమను తాము పోల్చుకున్నప్పుడు చాలా విచారకరమైనది జరుగుతుందని నేను భావిస్తున్నాను. పోలిక మరియు పోటీ వలన మనం ఉండేందుకు మరియు చేయడానికి దేవుడు రూపొందించిన దానిని చేయడంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాము.
మనకున్న బహుమానం లేదా వరములతో సంతృప్తి చెందాలని నేటి వచనం మనకు ఉపదేశిస్తుంది. మన వరములు దేవుని నుండి వస్తాయి మరియు ఆయన మనకు అనుగ్రహించే వరములతో మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనకు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తప్ప మనకు ఇతర వరములు లభించవు. మనము పరిశుద్ధాత్మను విశ్వసించాలి, దేవుని చిత్తం భూమిపై మరియు మన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతుందని నిర్ధారించుకోవడానికి సహాయం చేయడానికి ఆయన భూమికి పంపబడ్డాడని విశ్వసించాలి.
మనలో నివసించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపాడనే వాస్తవాన్ని ధ్యానించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. యేసుక్రీస్తును రక్షకునిగా మరియు ప్రభువుగా నిజంగా అంగీకరించిన ప్రతి వ్యక్తి లో ఆయన నిజంగా నివసిస్తున్నాడు. యేసు తాను కలిగి యున్న దానిని స్వంతం చేసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు విమోచన చివరి రోజు వరకు మనలను ఉంచడానికి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. ఆయన మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు, తద్వారా మనం కలిగి ఉండటానికి యేసు మరణించిన దాని యొక్క సంపూర్ణతలోకి మనలను నడిపించగలడు. మనం మన పిలుపుకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు లేదా మనం ఉన్నదానితో మరియు మనకు ఉన్నదానిపై అసంతృప్తిగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ యొక్క పని మరియు జ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడతాము. మనం ఆయనకు లోబడాలి, ఆయన స్వరానికి లోబడాలి, ఆయన మనలో ఉంచిన వరములను అభివృద్ధి చేసుకోవాలి మరియు ఆయన సహాయంతో మన జీవితాలను ఉద్రేకంతో మరియు సంపూర్తిగా దేవుని మహిమ కొరకు జీవించాలి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: తృప్తి అనేది దేవుడు మెచ్చుకుంటాడు. మనం ఆయనను విశ్వసిస్తున్నామని మరియు ఆయన మన కోసం చేసేదంతా అభినందిస్తున్నామని ఇది ఆయనకు తెలియజేస్తుంది.