దేవుడే మీ “ఒక్క విషయముగా” చేయండి

దేవుడే మీ “ఒక్క విషయముగా” చేయండి

యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను… -కీర్తనలు 27:4  

జీవితం సంక్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. మనము సంక్లిష్టంగా, నిరాశకు, నిస్పృహకు గురయ్యే జీవితాలను గడుపుటకు యేసు మన కొరకు మరణించలేదు. యోహాను 10:10లో మనము సమృద్ధి జీవితం గడుపుతూ ఆనందించునట్లు ఆయన మనకోసం చనిపోయాడని చెప్పబడింది. ఏ నిమిషమైతే ప్రతిదీ క్లిష్టమౌతుందో అది ఆనందమును దొంగిలిస్తుంది.  ఒత్తిడిని ఆపుట మరియు అత్యధికముగా పని ఒత్తిడి కలిగియున్న జీవితాలను జీవించుట ఆపివేయుటను మనం నేర్చుకోవాలి.

వ్యతిరేక జీవన సరళిలో ఒకటి సాదా జీవితం. సాదా జీవితం అనగా, అందులో ఒకే విషయం ఉంటుంది దేనితో కలవదు. నేను సాదాగా జీవించుటను గురించి దేవుడు నాతో వ్యవహరించియున్నాడు.  అతను చేయగల ఏకైక మార్గం కేవలం “ఒక విషయం” తో వ్యవహరించడమే అని చెప్పడం ద్వారా అయన నాకు చూపించాడు.

దేవుడు తనను గురించి మనము తెలుసుకోవాలని కోరుతున్నాడు. మనం చిన్నపిల్లలుగా ఆయనకు వద్దకు వచ్చి  “నేను నమ్ముతాను” అని అతని వాక్యములో చెప్పబడినట్లుగా మనము చెప్పకపోతే మనం అయన రాజ్యమును వారసత్వంగా పొందలేము.

ఇది దాదాపు చాలా సులభం అనిపిస్తుంది, మరియు మీరు దాన్ని క్లిష్టతరం చేయాలని అనుకోవచ్చు … కానీ అలా చేయవద్దు! మీ కోసం దేవుడు కలిగియున్న ప్రణాళిక సులభం. ఇది మీ మనసును అర్ధవంతం చేయదు, కానీ దేవుని గురించి సంక్లిష్టంగా ఏమీ లేదు, మరియు మీరు సంక్లిష్టంగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. నేడు ఆయన దగ్గరకు వచ్చి, “నేను నమ్ముతున్నాను” అని చెప్పండి. మీకు అవసరమైన “ఒక్క విషయంగా” ఆయనను చేయండి.

ప్రారంభ ప్రార్థన

దేవా,  నేను నిన్ను నమ్ముతున్నాను. నేను ఇబ్బందుల ద్వారా భారంగా జీవించాలనుకోవడం లేదు, కాబట్టి ఈరోజు, నేను నిన్ను కోరుకునే “ఒక్క విషయముగా” చేయడం ద్వారా సరళమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. మీ సాధారణ ప్రణాళికలో నన్ను నడిపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon