దేవుని అసాధారణ దయ

దేవుని అసాధారణ దయ

యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.  —1 సమూయేలు 2:7

సాధారణ దయ మరియు అసాధారణ దయ మధ్య చాలా భిన్నత్వం ఉన్నది. సాధారణ దయను సంపాదించుకొనవలెను, కానీ అసాధారణ దయ అనునది దేవుని నుండి వచ్చే కృపగల బహుమానము.

1 సమూయేలు 2:7 ఇలా చెప్పునదేమనగా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దీనిని గురించిన పరిపూర్ణ ఉదాహరణ ఎస్తేరు జీవితములో కనపడుతుంది. దేశమంతటికీ ఆమె రాణి అగునట్లు దేవుడామెను చీకటిలో నుండి పైకి లేపాడు. రాజుతో సహా ఆమె కలిసిన ప్రతి ఒక్కరి నుండి ఆమెకు దయపొందునట్లు దేవుడు చేసియున్నాడు.

చెడ్డవాడైన హామాను చంపాలని ప్రయత్నించిన తన జనాంగమును మరియు ఆమెను రక్షించుకొనుటకు ఎస్తేరు దయ పొందుకొనియున్నది. ఆమె రాజు వద్దకు వెళ్లి అతనిని సహాయం చేయుమని అడుగుటకు భయపడి యుండవచ్చు కానీ ఆమెకు దేవుని దయ కలదని ఎస్తేరు ఎరిగియున్నది మరియు ఆయనలో ఆమె పూర్తి విశ్వాసముతో ముందుకు వెళ్లియున్నది.

ఎస్తేరు వలె, దేవుని దయలో జీవించుట ద్వారా వచ్చే స్వేచ్చ మరియు స్వాతంత్ర్యములో మనము జీవించవలెను. మీ జీవితములో ఎదురయ్యే పరిస్థితులను బట్టి కాక, దేవుని అసాధారణ దయ కొరకు నమ్మిక యుంచండి.

ఎంత నిరీక్షణ లేని పరిస్థితులు ఎదురైనా దేవుడు నిన్ను పైకెత్తగలడు. మీ జీవితము దేవుని చేతిలో యుండిన యెడల దేవుని వెలుగు మీ మీద ప్రకాశించును.

ప్రారంభ ప్రార్థన

దేవా, నేను సాధారణ దయ మీద నేను ఆధారపడుట లేదు. బదులుగా, నేను నీ అసాధారణ కృపలో జీవించాలని ఆశిస్తున్నాను. నా జీవితము మీ చేతులలో ఉన్నప్పుడు,  మీరు నన్ను పైకెత్త గలరని నేను ఎరిగి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon