నిర్ణయాత్మకంగా ఉండండి

నిర్ణయాత్మకంగా ఉండండి

నా సహోదరులారా, (అన్నిటికన్నా) ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. —యాకోబు 5:12

నిర్ణయం తీసుకోలేకపోవుట అనునది చాలా కష్టంగా ఉంటుంది మరియు ఖచ్చితముగా అది ఒక సాధారణ జీవితమునకు ఫలమునివ్వదు. అపోస్తలుడైన యాకోబు తన మార్గములలో రెండు మనస్సులు కలిగి యున్నవాడు అస్థిరుడని చెప్పాడు.

నిర్ణయం తీసుకోనలేక పోవుటకు కారణము మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏమీ పొందలేరనే భయమును కలిగి యుండుటయే. మన మనస్సులను మనము స్థిరముగా ఉంచలేక పోయినప్పుడు ఎంత సమయాన్ని మనము వృధా చేస్తున్నాము?

మనము ఒక నిర్ణయము తీసుకొనుటకు మరియు దానియందు నిలబడుటకు మనము కొన్నిసార్లు నిర్ణయాలపై చాలా కష్టపడతాము. ఇది ఒక సామాన్య ఉదాహరణ కావచ్చు, కానీ దీనిని గురించి ఆలోచించండి: మీరు ఉదయాన్నే మీ బీరువా ముందు నిలబడి మీ దుస్తుల వైపు చూస్తూ ఏదో ఒక దానిని ఎన్నుకొని దానిని ధరిస్తారు. మీ పని ఆలస్యమైతే తప్ప మీరు వెనక్కి ముందుకు వెళ్ళవద్దు!

మీ గురించి మీరు రెండవ ఊహ లేకుండా లేక మీరు తీసుకునే నిర్ణయాల గురించి చింతించకుండా మీరు నిర్ణయాలు తీసుకొనుట ప్రారంభించమని ప్రోత్సహిస్తున్నాను.  మీరు రెండు మనస్సులను కలిగి ఉండకండి, ఎందుకంటే మీ నిర్ణయాలు మీకు నచ్చిన తరువాత మీరు వాటిని అన్నింటిని అనుభవిస్తారు. మీరు చేయగలిగిన ఉత్తమ నిర్ణయాలు తీసుకోండి మరియు ఫలితాల గురించి దేవునిని నమ్మండి.

ప్రారంభ ప్రార్థన

పరిశుద్దాత్మా, నిర్ణయాలు తీసుకొనుటలోని అశక్తత నన్ను ఎక్కడికి నడిపించదని తెలియజేసినందుకు వందనాలు. నా “అవును” అనునది “అవును” గా ఉండునట్లు “కాదు” అనునది “కాదు” గా ఉండునట్లు చేయుటకు సహాయం చేయండి. నేను చేయగల ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరియు ఫలితాల కొరకు దేవుని వద్ద వేచియున్నప్పుడు నేను తప్పు చేయనని నాకు తెలుసు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon