నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా (దేవునివలె) సృష్టింపబడిన నవీనస్వభావమును (పునరుజ్జీవమును) ధరించుకొనవలెను. —ఎఫెసీ 4:24
మీ గతములో సంభవించిన బాధాకరమైన విషయములు జరిగి మరియు వెళ్లి పోయిన తరువాత, దేవుడు మీ జీవితములోని ప్రతి రోజులో ఆనందించాలని కోరుతున్నాడు. ఏదేమైనా, యేసు మరణం మరియు పునరుత్థానం ద్వారా మీ కోసం ఏర్పరచబడియున్న సమృద్ధి జీవితాన్ని పట్టుకోవటానికి మీరు మీ మనస్సును స్థిరపరచుకునే వరకు ఇది జరగదు. అప్పటి వరకు, సాతానుడు దానిని తీసివేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు చెప్పెను (యోహాను 10:10). యేసు మన కొరకు మరణించుటకు మరియు సమృద్ధియైన జీవితమును మనకు అనుగ్రహించుటకు ఈ లోకమునకు వచ్చి యున్నాడు!
ఆయన ఇచ్చిన జీవితముతో, మీరు నూతన సృష్టియైయున్నారు. మీ గతములో సంభవించిన విషయాలు మీ భవిష్యత్తును అనగా క్రీస్తులో మీ నూతన జీవితమును ప్రభావితము చేయునట్లు అనుమతించవద్దు. క్రీస్తులో నూతన సృష్టిగా దేవుని వాక్య ప్రకారము మీ మనస్సు మారి నూతనమగుట వలన మీ ఉద్రేకములు స్వస్థ పరచబడి పునరుద్ధరించబడతాయి. యేసు మీ కోసం కొన్న క్రొత్త స్వభావంతో మీరు జీవించినప్పుడు దేవుని మంచి ప్రణాళికలు విప్పబడతాయి.
ప్రారంభ ప్రార్థన
దేవా, యేసు నన్ను కొన్నందుకు నేను అనుదినము, ఉత్సాహముగా నూతన స్వభావమును ధరించుటకు ఎన్నుకున్నాను. నేను క్రీస్తులో – ఆనందకరమైన, శాంతియుతమైన మరియు మీలో ఉన్న సంపూర్ణ సృష్టితో నేను పునర్జీవింప బడ్డాను!