ప్రభువే మీ బలము

ప్రభువే మీ బలము

…తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. —ఎఫెసీ 6:10

విశ్వాసులను అలసిపోవునట్లు చేయుటయే సాతాను ప్రణాళికలోని ఒక భాగమని మనము గుర్తించాలి. దానియేలు 7:25 లో దానియేలు పొందుకొనిన ఒక దర్శనమును గురించి తెలియజేయుచున్నది: ఆ రాజు…. కానీ ఆయన మనలను ప్రోత్సహించబడమని కోరుతున్నాడు. రోమా 8:37 క్రైస్తవులకు ఒక శుభవార్తను తెలియజేయుచున్నది: అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. “అత్యధిక విజయము పొందుచున్న వారము” అనగా సమస్య ప్రారంభించక మునుపే ఎవరు గెలుస్తారో మనం ముందుగానే ఎరిగి యున్నాము. నేను దానిని ఇష్టపడుతున్నాను, నీవు కూడా ఇష్టపడుతున్నావా?

మనము మన హృదయాల్లో ప్రార్ధన మరియు ఆయన వాక్యము ద్వారా దేవునితో అటువంటి సన్నిహిత సంబంధమును, కలిగి యుండగలము తద్వారా మనము ఆయన వాగ్ధానముల శక్తి వలన మనము స్థిరముగా బలపరచబడగలము. దేవునితో సన్నిహిత సంబంధము ద్వారా సాతానును ఎదిరించే బలమైన క్రైస్తవులను ఉత్పత్తి చేయగలము!

మీ జీవితమును పూర్తిగా దేవుని బలముతో పూర్తి ఆత్మ విశ్వాసముతో జీవించుము మరియు అలసి సొలసిన పరిశుద్ధులను ఉత్పత్తి చేసే శోధనలను గురించి మీరు భయపడనవసరం లేదు. ఆయనలో మరియు ఆయన బలమైన శక్తిలో బలముగా ఉండుము.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరే నా బలము! నేను అలసిపోయిన క్రైస్తవుడుగా ఉండునట్లు నేను సాతానును అనుమతించను, కానీ నీతో నా సన్నిహిత సంబంధము ద్వారా నేను బలము పొందుకుంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon