ప్రార్ధన ద్వారా దేవుని శక్తిని పొందుకొనుట

ప్రార్ధన ద్వారా దేవుని శక్తిని పొందుకొనుట

శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. —హెబ్రీ 5:7

ప్రార్థన చాలా శక్తివంతమైనది, ఎందుకంటే అది భూమిపై ప్రజల హృదయాలను పరలోకంలో ఉన్న దేవుని హృదయంతో చేరుస్తుంది. మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దేవునితో అనుసంధానమును కలిగి యుంటాము, మరియు ఆయన మన ఆలోచనలను మించి మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తాడు.

విశ్వమంతటిలో అందుబాటులో ఉన్న గొప్ప శక్తులలో ప్రార్ధన ఒకటి అని నేను నమ్ముతున్నాను. ఇది ఒక ధైర్యముతో కూడిన ప్రకటన లాగా అనిపించవచ్చు, కానీ అది నిజం!

ప్రార్థన దేవుని పని కోసం తలుపు తెరుస్తుంది. మన జీవితాల్లోకి ప్రవేశించడానికి మరియు జ్ఞానం, దిశ, ప్రోత్సాహం లేదా అద్భుత పురోగతిని తీసుకురావటానికి మనకు పరలోకపు శక్తి అవసరమైతే నీవు మరియు నేను భూమిపై పాలుపంచుకోగల చర్య ఇది. ప్రార్థన దేవుని శక్తితో మనల్ని అనుసంధానం చేస్తుంది – అందుకే మనము ఎన్నడూ ఊహించని దాని కంటే ఇది గొప్ప శక్తియై యున్నది. యేసు భూమి మీద ఉన్నప్పుడే ఈ శక్తికొరకు ప్రార్థించడానికి, ఆయనను స్వీకరించడానికి కూడా ఆయన అవసరతను కలిగి యున్నాడు.
దేవుని శక్తి మాత్రమే శాంతి మరియు ఆనందం తెస్తుంది, జ్ఞానం మంజూరు చేస్తుంది, ఒక వ్యక్తి యొక్క జీవితం విలువ మరియు ప్రయోజనం యొక్క జ్ఞానం ఇస్తాయి, మరియు ప్రతి రకమైన అద్భుతం చేయవచ్చు.

మీరు మీ జీవితంలో ఆ శక్తి క్రియను చూడాలనుకుంటున్నారా? అయితే ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, ప్రార్థన శక్తి పూర్తిగా నమ్మశక్యంకానిదిగా ఉంది. నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను మరియు నా జీవితంలో మీరు పని చేయాలని అనుకుంటున్నాను, కనుక ఇప్పుడు నీతో నిరంతరం ప్రార్ధన చేసే స్థితిలో నేను ఉండటానికి నన్ను సమర్పించుకుంటున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon