మంచి పోరాటమును ఎలా పోరాడాలి?

మంచి పోరాటమును ఎలా పోరాడాలి?

విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. -1 తిమోతి 6:12

శత్రువుపై విశ్వాసంతో మంచి పోరాటంతో పోరాడాలి – ఆ దృశ్యం ఆచరణాత్మకంగా ఎలా కనపడుతుంది? ఇక్కడ ఆరు కీలక వ్యూహాలు ఉన్నాయి:

  1. దూకుడుగా ఆలోచించండి. యుద్ధానికి సిద్ధమవుతున్న యోధుడు మాదిరిగానే, శత్రువును యుద్ధంలో నిమగ్నం చేసి శత్రువును ఎలా ఓడించాలో ప్రణాళిక వేయండి.
  2. తీవ్రంగా ప్రార్థించండి. హెబ్రీయులకు 4:16 మనకు దేవుని సింహాసనం వద్దకు నమ్మకంగా మరియు ధైర్యంగా రమ్మని నిర్దేశిస్తుంది. విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్ళండి మరియు నీకు ఏమి అవసరమో చెప్పండి.
  3. నిర్భయముగా మాట్లాడు. మొదటి పేతురు 4:11 చెబుతుంది, ఎవరైతే మాట్లాడతారో, [దానిని ఎవరైతే విని చేస్తారో] దేవుని శాసనాలు…. నీవు మరియు నేను దుష్టశక్తులకు వ్యతిరేకముగా ఆత్మీయముగా ఆజ్ఞాపించు స్వరమును కలిగి యున్నాము.
  4. సమృధ్ధిగా ఇవ్వండి. మనము ఇచ్చే విధానాన్ని బట్టి మనము పొందుకుంటాము (లూకా 6:38 చూడండి). దాతృత్వం కలిగి జీవించండి.
  5. ఉద్దేశ్యముతో పనిచేయండి. మీరు మీ చేతితో ఏది చేసినా దానిని నీ శక్తి యంతటితో చేయండి. (ప్రసంగి 9:10). మీరు పని పూర్తి చేయునట్లు మీరు పరిశుద్ధాత్మతో కదిలించబడండి.
  6. బేషరతుగా ప్రేమించండి. దేవుని పిల్లలుగా మనము, దేవుడు బేషరతుగా మరియు త్యాగపూరితంగా మనలను ప్రేమిస్తున్నట్లుగా మనం ఇతరులను ప్రేమించాలి.

ఈ మెట్లను అనుసరించండి మరియు, శత్రువు వచ్చినప్పుడు మీరు దేవుని శక్తితో నిండిపోతారు-మిమ్మల్ని ఎవరు గెలవలేరు.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను వెనుక కూర్చుని మీరు నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా విశ్వాసం యొక్క పోరాటమును కోల్పోవాలని నేను కోరుకొనుట లేదు. నేను ముందుకు వెళ్ళినప్పుడు, శత్రువుపై నా పోరాటంలో ఈ ఆరు వ్యూహాలను ఎలా అన్వయించాలో నాకు చూపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon