మన గొప్ప వాంఛ

మన గొప్ప వాంఛ

వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. (యెషయా 49:10)

మనం ఆయనను కోరుకోవడం కంటే ఎక్కువగా దేనినీ కోరుకోవాలని దేవుడు ఆశించడు. మనం వస్తువులను కోరుకోకూడదని కాదు, మనం ఆయన కంటే ఎక్కువగా దేనినీ కోరుకోకూడదు. మన జీవితంలోని ప్రతిరోజు ఆయన సన్నిధి యొక్క వాస్తవికతలో జీవించాలని మరియు ఆయనను బట్టి పూర్తిగా సంతృప్తి చెందాలని ఆయన కోరుకుంటాడు.

ఈరోజు వచనాలు ఎండమావి గురించి మాట్లాడుతున్నాయి. మనకు నిజంగా దేవుని కోసం దాహం ఉంది, కానీ మనం కోరుకునే వ్యక్తి ఆయన అని మనం గ్రహించకపోతే, ఎడారిలో దాహంతో ఉన్న ప్రయాణికులను ఎండమావి ఎలా తప్పుదోవ పట్టిస్తుందో అదే విధంగా మనల్ని సులభంగా తప్పుదారి పట్టించవచ్చు. సాతాను మనల్ని ఎప్పటికీ సంతృప్తిపరచని విషయాలపై దృష్టి పెట్టేలా చేయడం ద్వారా మనల్ని మోసం చేయవచ్చు. దేవుడు తప్ప మరేదీ మనలను సంతృప్తి పరచదు, కాబట్టి మనం ఆయనను వెతకడానికి మన మనస్సులను సిద్ధ పరచుకోవాలి. మన కోరికలు, ఆలోచనలు, సంభాషణలు మరియు ఎంపికలలో మనం ఆయనకు మొదటి స్థానం ఇస్తే, మన దాహం నిజంగా తీర్చబడుతుంది మరియు మనం తప్పుదారి పట్టించబడము.

మనకు చట్టబద్ధమైన అవసరాలు ఉన్నాయి మరియు దేవుడు వాటిని తీర్చాలనుకుంటున్నాడు. మనం ఆయన ముఖాన్ని (సన్నిధిని) వెతికితే, ఆయన చేయి మనకోసం ఎల్లప్పుడూ చాచే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, మనం వస్తువులను వెతికితే మనం సులభంగా మోసపోవచ్చు మరియు ఎండమావుల ద్వారా మన జీవితాలను చాలా వృధా చేసుకున్నామని కనుగొనవచ్చు – మనకు అవసరమైనవిగా కనిపించినప్పటికీ అవి మనకు ఉపయోగం కావు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీకు అవసరమైన సమస్తమును దేవుడు కలిగి యున్నాడు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon