మానవ స్వభావమును అర్ధం చేసుకొనుట

మానవ స్వభావమును అర్ధం చేసుకొనుట

అయితే యేసు (అయన భాగం కొరకు) అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.   —యోహాను 2:24-25

నేను ఒకసారి సంఘములో నిరుత్సాహమైన సంఘటనలో నేను కూడా భాగముగా ఉన్న తరువాత, దేవుడు యోహాను 2:24-25 వచనమును నా దృష్టికి తెచ్చాడు. ఇది తన శిష్యులతో యేసు కలిగియున్న సంబంధమును గురించి మాట్లాడుతుంది.

ఇది మనకు తెలియజేయుచున్నదేమనగా యేసు తనను వారి వశము చేసుకోలేదు. ఆయన తనను తాను సంబందార్ధకముగా వారికి సమర్పించుకొనుచుండగా మరియు వారితో జీవితమును జీవించుచుండగా, వారు పరిపూర్ణులు కారని ఆయనకు తెలుసు. ఆయన మానవ స్వభావమును అర్ధం చేసుకున్నాడు మరియు ఆయన అసమతుల్యమైన మార్గములో ఆయన తనను వారి వశము చేసుకోలేదు.

నేను దేవుని యందు మాత్రమే నమ్మిక యుంచకుండా ప్రజల మీద నా నమ్మిక యుంచి యున్నానని ఈ సంఘటన ద్వారా నేను గ్రహించాను మరియు నేను నిరుత్సాహముతో నన్ను నేను సరి చేసుకున్నాను.

మనము ఏ మానవ సంబంధాలలోనైనా ఎంత దూరమైనా వెళ్ళగలము. మనము దైవిక జ్ఞానమును మించి వెళ్ళినట్లయితే, మనము గాయపరచబడుటకు అవకాశము కలదు. కొంత మంది ప్రజలు మనలను ఎప్పుడు గాయపరచరనే ఉచ్చులో సులభముగా పడగలము, కేవలము నిరుత్సాహపరచుటకు ఆ ప్రమాణముల వరకు వారు జీవించరు. ఎవరూ పరిపూర్ణులు కారు.

ఒక శుభవార్త ఏదనగా దేవుడు పరిపూర్ణుడు మరియు ఆయన మనలను నిరుత్సాహ పరచడు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమించువాడు మరియు మంచి వాడు. ఒకటి దేవునికి చెందినదైతే దాని కొరకు మనుష్యల యందు నమ్మిక యుంచ కూడదు, కానీ దానికి బదులుగా మిమ్మును మీరు పూర్తిగా దేవునికి సమర్పించుకొనుము. ఆయన ఒక్కడే పూర్తిగా నమ్మదగిన వాడు.

ప్రారంభ ప్రార్థన

దేవా, ఏ ఒక్క మానవుడు పరిపూర్ణుడు కాదు కానీ నీవు మాత్రమే పరిపూర్ణుడవు. నేను అన్ని వేళలా మీ మీదనే నమ్మిక యుంచాలని ఆశిస్తున్నాను. నీ పరిపూర్ణతలో ఈరోజు నేను ఆదరణ పొందుతున్నాను. 

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon