మిమ్మల్ని మీరే సాగదీయకండి

మిమ్మల్ని మీరే సాగదీయకండి

నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?  —కీర్తనలు 62:1-2

ఇది మీకు ఎప్పుడైనా సంభవించి యున్నదా : మీరు ఒక రబ్బరు బ్యాండ్ ను దేనికైనా చుట్టుతున్నప్పుడు మీరు దానిని త్రెంచియుండవచ్చు. మీకు మరొకటి లేదు కనుక తెగిన దానిని రెండు చివరల పట్టుకొని ముడి వేయుటకు ప్రయత్నిస్తారు.

కొన్నిసార్లు మన దైనందిన జీవితాల్లో మన సామర్ధ్యమును మించి మనము పని చేయుటకు ప్రయత్నిస్తాము మరియు మనము రబ్బర్ బ్యాండ్ వలె తెగిపోతాము. కేవలము రెండు చివరల ముడి వేయుట ద్వారా మీరు సమస్యను పరిష్కరించాలని చూస్తారు. కానీ చాల త్వరలోనే మనము పాత స్వభావమునకు వచ్చి తిరిగి మొదటి స్థానములోనే తెగిపోవుటకు అవకాశం కలదు.

ఒత్తిడితో అనేకసార్లు మనము కనపడుతుండగా, మన జీవితం తెగిపోయిన రబ్బర్ బ్యాండ్ లాగా మారుతుంది. అది పూర్తిగా మనలను తగ్గిస్తుంది.

మన జీవితములకు సంబంధించిన దేవుని నియమములు మరియు ఆయన విధించిన పరిమితులు చివరకు దహించివేయబడుటకు కారణమవుతాయి. మీరు మనస్సుతో, ఉద్రేకములతో మరియు శరీరముతో వెల చెల్లించకుండా అధికముగా పని చేయుటను కొనసాగించలేరు. కానీ ఆవిధంగా మీరు జీవించుటను దేవుడు కోరుకొనుట లేదు.

మీ ఉద్దేశ్యములను దేవుని ఉద్దేశ్యములతో సరి చేసుకోండి. మీ జీవితమునకు ఆయన సమాధానమును మరియు పరిధిని వెదకండి. మీ శరీరమును గౌరవించండి. మంచి ఆరోగ్యమును వెలలేని బహుమానముగా చూసుకోండి. దేవుడు మీకిచ్చిన శక్తిని ఒత్తిడితో వ్యర్ధం చేయవద్దు. దానిని జీవించుటకు మరియు జీవితమును ఆనందించుటకు దాచి యుంచండి!


ప్రారంభ ప్రార్థన

దేవా, నీలో నా విశ్రాంతి పొందాలని ఆశిస్తున్నాను. మీరు స్థిరముగా ఒత్తిడిలో ముందుకు సాగుట కంటే మీరు నా జీవితములో ఏర్పరచిన పరిధిని ఎలా అనుసరించాలో నాకు చూపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon