మీరు భయములో పడవద్దు

మీరు భయములో పడవద్దు

యెహోవా (హారాను లో) నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి (నీ స్వంత మేలు కొరకు) నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. —ఆదికాండము 12:1

అబ్రాము అను పేరు గల వ్యక్తి తన వ్యక్తిగత భయముతో బాధ పడుతున్నప్పటికీ అతడు దేవుని యందు నమ్మిక యుంచినట్లు బైబిల్ చెప్తుంది.

మీ ఇంటిని, మీ కుటుంబమును, మీకు తెలిసిన సమస్తమును మీ సౌకర్యమును వదిలి మీరెరుగని ప్రదేశమునకు వెళ్ళమని దేవుడు మీతో చెప్తే మీరెలా భావిస్తారు? భయముతో నిండి యుంటారా? ఖచ్చితముగా అదే చేయమని దేవుడు అబ్రహముతో చెప్పి యున్నాడు – మరియు అది అతనిని భయపెట్టింది. కానీ అతనికి దేవుడు చెప్పిన మాటలు “భయపడవద్దు”.

మనము భయపడనంత వరకు మనము ఏదైనా చేయాలనీ అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాము, కానీ మనము దానిని చేసిన యెడల దేవుని కొరకు, ఇతరుల కొరకు లేక మన కొరకు కొంత మాత్రమే సాధించగలము. అబ్రాము భయముతో ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసములో మరియు విదేయతలో అడుగు ముందుకు వేయవలసి యున్నది.

ఒకవేళ అబ్రాము భయముతో మోకరించినట్లైతే అనేక జనములకు తండ్రిగా – ఉండునట్లు దేవుడు అతనిని సృష్టించినట్లు అతని గమ్యమును చేరకుండా ఉండేవాడు.

భయములో జీవించుట ద్వారా దేవుడు మీ కొరకు కలిగియున్న ఉత్తమ ప్రణాళికను మార్చివేస్తుంది, కాబట్టి మీరు దానికి భయపడునట్లు చేసినా… దేవుడు ఆశించిన దానిని చేయండి!  అబ్రాము వలె, మీ బహుమానము అత్యదికమగునని మీరు కనుగొంటారు.


ప్రారంభ ప్రార్థన

దేవా, అబ్రాము భయపడినప్పటికీ అతడు విధేయత చూపినప్పుడు మీరు అతని యెడల నమ్మకముగా ఉన్నారు, కాబట్టి నేను కుడా భయమును ఎదిరిస్తున్నాను మరియు మీరు నాకు చేయమని చెప్పిన దానిని మీరు చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon