మీ ప్రయాణపు మార్గదర్శిగా దేవునిని అనుమతించండి

మీ ప్రయాణపు మార్గదర్శిగా దేవునిని అనుమతించండి

ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. —కీర్తనలు 48:14

యేసు ఈ భూమీ మీద నడిచినప్పుడు, ఆయనకు ఎల్లప్పుడూ సరియైనది చేయాలని సరిగ్గా తెలుసు ఎందుకంటే యేసు తన తండ్రి చేసిన దానిని మాత్రమే చూశాడు గనుక ఆయన చేసినదే చేశాడు. మన ప్రభువు వలెనే, మనము ప్రతి రోజు సరియైన దారిలో నడచునట్లు ఆయననే నమ్మగలము.

కీర్తనలు 48:14, మరణం వరకు దేవుడు మనలను నడిపించునని చెప్తుంది ! మన జీవితంలోని ఒక గమ్యం నుండి మనం తరువాత వరకూ వెళ్ళునట్లు ఒక మార్గదర్శిగా ఉన్నాడని తెలుసుకోవడం ఎంత అద్భుతమో కదా.

నా భర్త డేవ్, మరియు నేను క్రొత్త స్థలాన్ని సందర్శించినప్పుడు, మేము తరచూ ఒక మార్గదర్శినిని నియమించుకుంటాము. ఒకసారి మా స్వంతగా మేము అన్వేషించాలని నిర్ణయించాము కానీ దాని వలన మా సమయం వ్యర్ధం అయ్యింది అని త్వరగా కనుగొన్నాము. మేము చాలా సమయం వ్యర్ధముగా గడిపి మా మార్గం కనుగొనేందుకు ప్రయత్నించి నిరాశగా వెనక్కి తిరిగి వచ్చాము.

కొన్నిసార్లు మనం జీవితంలో అదేవిధంగా వ్యవహరిస్తామని నేను అనుకుంటాను. ఇది మీ స్వంతగా లక్ష్యం లేకుండా తిరుగు కంటే ఒక అనుభవం ఉన్న మార్గదర్శిని అనుసరించుట ఎల్లప్పుడూ సులభం. మీ సొంత మార్గంలో వెళ్లడానికి బదులు, మీ తండ్రి ఏమి చూస్తాడో చూడండి, మరియు ఆయన మిమ్మల్ని నడిపించనివ్వండి. దేవుడు మిమ్మల్ని నడిపించుటకు కట్టుబడి ఉన్నాడు, కాబట్టి మనము ఆయనను అనుసరించుట స్పష్టంగా ముఖ్యమైంది.


ప్రారంభ ప్రార్థన

దేవుడు, ఒక మార్గదర్శి లేకుండా నా సొంత మార్గంలో లక్ష్యం లేకుండా జీవితాన్ని గడపాలని నేను కోరుకోలేదు, నేను ఏమి చేయాలో మరియు ఎలా జీవించాలో మీరు మాత్రమే నాకు చూపగలరు, కాబట్టి నేను ప్రతిరోజూ మీ మార్గనిర్దేశాన్ని అనుసరిస్తాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon