మీ మూడు ఉత్తమ ఆయుధములు

మీ మూడు ఉత్తమ ఆయుధములు

మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము. —2 కొరింథి 10:3

జాగ్రత్తతో కూడిన వ్యూహంతో మరియు మోసపూరితమైన వంచన ద్వారా, సాతాను మీపై యుద్ధానికి ప్రయత్నిస్తాడు మరియు ఓటమి యొక్క ఆలోచనలో మిమ్మల్ని నిలుపుతాడు. కానీ దేవుడు మీకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ఆయుధాలను ఇచ్చాడు. ఇక్కడ మీరు శత్రువులను ఓడించటానికి ఉపయోగించే మూడు ప్రధాన ఆత్మీయ ఆయుధాలు ఇవ్వబడ్డాయి:

  1. దేవుని వాక్యము: దీనిని బోధించుట, ప్రకటించుట, ధ్యానించుట మరియు వ్యక్తిగత బైబిల్ అధ్యాయనం ద్వారా పొందుకుంటాము. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ప్రత్యక్షతగా మారునంత వరకు వాక్యమును కొనసాగించండి.
  2. స్తుతి: ఇది సాతానుని పోరాట ప్రణాళికల కంటే ఫలవంతముగా, త్వరితముగా ఓడిస్తుంది, కానీ అది యదార్ధమైన ఆరాధనయై యుండవలెను కానీ పెదవులతో చేసే మతపరమైన పద్దతిగా ఉండకూడదు.
  3. ప్రార్ధన: ప్రార్ధన అనునది దేవునితో కలిగి యుండే ఒక సంబంధము; ఇది ఆయనతో మాట్లాడుట, సమాచారాన్ని కలిగి యుండుట మరియు మీ హృదయములో నిండియున్న దానిని బట్టి ఆయనను సహాయమునకై వేడుకొనుట. ఇందులో దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా ఇమిడి యున్నది, మనము తండ్రితో సన్నిహిత మరియు వ్యక్తిగత సంబంధమును అభివృద్ధి చేసుకొనవలెను. అయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరియు ఆయన మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడని తెలుసుకొనుము.

ఒక యుద్ధము జరుగుతున్నది, కానీ దేవుడు మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు మరియు మీకు అవసరమైన యుద్దోపకరణములను అనుగ్రహించి యున్నాడు. సాతానుని పరుగెత్తునట్లు చేయుటకు వాటిని ఉపయోగించుము!

ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నా శత్రువుతో యుద్ధము చేయుటకు నాకు అవసరమైన ఆత్మీయ ఆయుధములను నాకు ఇచ్చినందుకు వందనములు. మీ సహాయముతో ఈరోజు నా యుద్దమును నేను గెలుస్తానని నాకు తెలుసు!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon