లేచి దేవునితో ముందుకు సాగుము!

లేచి దేవునితో ముందుకు సాగుము!

యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా! —యోహాను 5:8

యోహాను 5వ అధ్యాయములో నేను నమ్మే ఒక వ్యక్తి మారుటకు తృణీకరించే అనేక మంది వ్యక్తులను సూచిస్తున్నాడు.

యెరూషలేములోని యూదుల పండుగ దినములో స్వస్థత కొరకు రోగులు కూడుకునే బెతేస్థ కోనేటిని సందర్శించి యున్నాడు. అక్కడ వేచియున్న వారిలో ఒకరు 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు అతనిని చూసినప్పుడు నీవు స్వస్థ పడగోరుచున్నవా అని అడిగి యున్నాడు.

అతడు చెప్పిన జవాబును బట్టి 38 సంవత్సరాలుగా ఎందుకు స్వస్థపరచ బడలేదో నాకు అర్ధమైంది.  అతడు, “అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు…” ఆయనకు ఉత్తరమిచ్చెను. ఆ వ్యక్తి తన బాధ్యతను విస్మరిస్తున్నాడనునది అర్ధము.

అతని రెండవ సమస్య ఎదనగా అతడు ఇతరులను నిందించుట. ఆ వ్యక్తి “నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని” ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు ఎలా స్పందించాడు? అతని మీద జాలి పడలేదు. బదులుగా యేసు అతనితో “నీవు లేచి నీవు పరుపెత్తికొని నడువుమని” వానితో చెప్పెను.

మీ జీవితములో మార్పు జరగాలంటే, మీ పరిస్థితులకు మీరు బందీలు కాకూడదు. దేవుడు ఈరోజు మీకు సహాయం చేయునని తెలుసుకొనుము. ఆయన యందు నమ్మిక యుంచుటకు, లేచుటకు మరియు ఆయన మీ కొరకు అనుగ్రహించుచున్న స్వేచ్చను ఉత్సాహముగా పొందుకొనుటకు  మీరు ఈరోజే నిర్ణయించుకోండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, నా పరిస్థితులకు నేను బాధితుడనవ్వాలని ఆశించుట లేదు. నేను మారాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను నీ బలమును మరియు స్వేచ్చను పొందుకొనుచున్నాను. నేను నీతో నడచుచుండగా నా జీవితములో నిజమైన మార్పు కలుగుతుందని నేను నమ్ముతున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon