లోక ప్రమాణాలు కాక దేవుని ప్రమాణాలను ఎన్నుకోండి

లోక ప్రమాణాలు కాక దేవుని ప్రమాణాలను ఎన్నుకోండి

దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక … – కీర్తనలు 1:1

సమాజపు విలువలను తగ్గించి జీవించుటయనునది మన సంభాషణలు, వేసుకునే దుస్తులు, మనం చదివే విషయాలు మరియు మనము వీక్షించే టివి కార్యక్రమములు మరియు సినిమాల విషయంలో తీసుకునే ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో నిజాయితీ స్థాయి అనునది మనం జీవించే వ్యక్తిగా జీవితములు, ఇతరులతో మెలిగే విధానము మరియు మన వ్యాపారము లేక వృత్తులలో మనం చూపే గుణ లక్షణముల మీద ఆధారపడి యుంటుంది.

క్రైస్తవులముగా, మనము లోక ప్రమాణాలను పెరికి వేసి దేవుని ప్రమాణాలతో జీవించునట్లు ఒకరినొకరు ప్రోత్సహించు కొనవలెను. ఒక సుప్రసిద్ధ సామెత కొన్ని సలహాలను మనకు అందిస్తుంది: “మీ ఆలోచనలను గమనించండి మరియు అవి మాటలుగా మారతాయి. మీ మాటలను గమనించండి మరియు అవి క్రియలుగా మారతాయి.  మీ క్రియలను గమనించండి మరియు అవి అలవాటులుగా మారతాయి. మీ అలవాటులను గమనించండి మరియు అవి మీ గుణ లక్షణములుగా మారతాయి.  మీ గుణలక్షణములను గమనించండి మరియు అవి మీ గమ్యముగా మారతాయి.”

దేవుడు మనవ జాతికి ఇచ్చిన గొప్ప బహుమానము ఎదనగా నిర్ణయములు తీసుకొనుటకు మన స్వంత చిత్తము. ఆయన మన కొరకు కలిగియున్న ఆశీర్వాదములలో ఆనందించుటకు దేవుని వాక్యముతో మరియు అయన వాక్యపు విలువలతో సరితూగే జీవిత శైలిలో నిర్ణయములను తీసుకొనవలెను కానీ లోకపు విలువలతో స్థిరముగా నిలిచియుండే నిర్ణయములు కాదు.

మీరు చేసే ప్రతి పనిలో ఆయనకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చుట ద్వారా దేవునిని సంపూర్ణముగా సేవించమని నేను మిమ్మును ప్రాధేయ పడుతున్నాను.

ప్రారంభ ప్రార్థన

దేవా, నేను లోకపు ప్రమాణాలతో జీవించాలని ఆశించుట లేదు. నేను నీకు నా జీవితములో మొదటి ప్రాధాన్యతను అనుగ్రహించు చున్నాను, ఎందుకనగా, మీ మార్గములు ఉత్తమములని నేను ఎరిగి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon