వివాహములో త్యాగము

వివాహములో త్యాగము

మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేని (దేవుని ప్రేమ ద్వారా ఉత్తేజింప బడిన ఆత్మీయ భక్తీ లేని) వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.  —1 కొరింథీ 13:1

మా వివాహపు ప్రారంభంలో నిజముగా డేవ్ ను నేను ప్రేమించాలంటే కొన్నిసార్లు నేను త్యాగము చేయవలసి ఉంటుందని దేవుడు నాకు నేర్పించాడు. ఆ సమయం వరకు నా మార్గములో 1 కొరింథీ 13:1 లో చెప్పబడినట్లుగా మ్రోగెడు కంచును గణ గణ లాడు తాళము వలె ఉండే దానిని.

ప్రేమ అనునది పరిపక్వతలో ఉన్నత రూపమై యున్నది. ఒకవేళ ప్రేమకు మన వంతులో కొంత త్యాగము అవసరం లేనట్లైతే మేము నిజముగా మరియొక వ్యక్తిని ఏ మాత్రమూ ప్రేమించలేము. మన క్రియల్లో త్యాగము లేనట్లైతే వారు మన కొరకు చేసిన కొంత మంచికి స్పందిస్తూ ఉంటాము లేక వారి మీద మనము కొంత అధికారము చేయుటకు కొంత దయ చూపుతాము.

నిజమైన ప్రేమ తనను తానె సమర్పించు కుంటుందని అర్ధం చేసుకొనుట చాల ప్రాముఖ్యమైనది. కాబట్టి మీ నిర్ణయములు ఎల్లప్పుడూ మీ భాగస్వామి యొక్క ఆసక్తులను కలిగి యుండవలెను. మీరు దీనిని చేయునప్పుడు, మీరు మిమ్మల్ని సమర్పించుకుంటున్నారు.

దేవుని కోరిక ఎదనగా భార్యలు మరియు భర్తలు ఒకరినొకరు త్యాగ పూర్వకముగా మరియు నిబంధనలు లేకుండా ప్రేమించాలి. దీని అర్ధం మీ మార్గములో ఇది అన్ని సార్లు సాధ్యం కాదు. కానీ శుభవార్త ఎదనగా ఒక భార్య మరియు భర్త వారి స్వార్ధపూరిత కోరికలను త్యాగము చేసినప్పుడు వారు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కలిగి యుంటారు!


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నా వివాహ జీవితములో నిజమైన ప్రేమలో నడవాలని ఆశిస్తున్నాను. నేను నా స్వంత మార్గములో నెట్టబడ కుండునట్లు నేను ఒక నిర్ణయము తీసుకుంటున్నాను, కానీ నా భాగస్వామి కొరకు త్యాగము చేయుటకు సిద్ధంగా ఉండునట్లు నాకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon