వివేకము

వివేకము

జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.… —సామెతలు 16:21

ఈరోజు మనము ఎక్కువగా వినని మాట వివేకము. దీని అర్ధము “జాగ్రత్తగా వ్యవహరించుట: ఆర్ధిక వ్యవస్థ.”

బైబిల్ లో, వివేకము లేక తెలివి కలిగి యుండుట అనగా “ఉపయోగించుటకు దేవుడిచ్చిన వరముల విషయంలో మంచి గృహనిర్వహకులుగా లేక నాయకులుగా ఉండుట”. ఆ వరములలో సమయం, శక్తి, బలము మరియు ఆరోగ్యము – వస్తుపరమైన ఆస్తులు కూడా. అందులో మన శరీరములు, అలాగే మన మనస్సులు మరియు మన ఆత్మలు కూడా ఉంటాయి.

మనలో ప్రతి ఒక్కరికీ విభిన్న వరములను పొంది యుండగా మనలో ప్రతి ఒక్కరూ ఆ వరములను వ్యవహరించుటకు విభిన్న సామర్ద్యముల స్థాయిలు ఇవ్వబడ్డాయి.

అనేక మంది ప్రజలు ఈ వరములను దేవుడు ఉద్దేశించిన రీతిగా ఉపయోగించకుండా తమను తాము హాని చేసుకుంటున్నారు. ఇతరులను సంతోషపరచుటకు మనల్ని మనము ముందుకు నెట్టుచుండగా మనము దేవుడు చెప్పేది వినాలి ఎందుకంటే ఆయన చెప్పునది జ్ఞానమై యున్నది.

ప్రజలను సంతోష పరచుటకు ప్రయత్నిస్తూ వారి స్థాయికి ఎదుగుటకు ప్రయత్నించుట వివేకము కాదు. వివేకము అనగా ఈ వరములను ఎలా వాడుకోవాలో దేవునిని  అడిగి దాని ప్రకారము విధేయత చూపుటయే.  ఈరోజు దేవుని వివేకమును గురించి నేర్చుకోండి మరియు దేవుడు ఆశించిన రీతిగా మీరు జీవితాన్ని ఆనందించగలరు గనుక దానిని ఆచరణలో పెట్టండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నాకు అనుగ్రహించిన దానంతటిలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండవలెనని ఆశిస్తున్నాను. నేను నా వరములను మరియు సామర్ధ్యములను దేవుని కొరకు మాత్రమే వాడవలేనని నిర్ణయించుకున్నాను. మీ వివేకము మరియు జ్ఞానముతో వాటిని ఎలా ఉపయోగించాలో నాకు చూపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon