శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. —రోమా 12:18
మనము నేర్చుకొనిన ప్రముఖ్యమైన పాఠము ఏదనగా “నేను విచ్చిన్నం కాకుండునట్లు వంగుతాను (తగ్గించుకుంటాను)”. బైబిలు మిమ్మల్ని [వ్యక్తులతో, విషయాలతో] వెంటనే సర్దుబాటు చేసుకోవాలని చెబుతుంది. మరియు, వీలైతే, మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా జీవించండి. (రోమా 12:16, 18).
నేను నా జీవితములో దేవుని వాక్యమునకు ప్రధమ స్థానము ఇవ్వనప్పుడు మరియు విధేయత గల జీవితమును జీవించుటకు నిర్ణయించుకొనినప్పుడు నేను నా స్వంత మార్గమును ఎన్నుకోవలసి వచ్చింది. నేను స్వీకరించలేను; మిగతా అందరూ నాకు అనుగుణంగా ఉండాలని నేను కోరుకున్నాను. వాస్తవానికి, అది మరింత కలహాలు మరియు ఒత్తిడికి దారితీసింది.
నేను తగ్గించుకొనుట నేర్చుకున్నాను. దానిని పాటించుట అంత సులభం కాదు మరియు నేను ప్రణాళికను కలిగి యున్నట్లు కాక విభిన్నముగా చేయుట నేర్చుకున్నాను, కానీ కలత చెందడం మరియు దయనీయంగా ఉండటం కంటే ఇది సులభం.
మీరు మీ సంబంధాలలో శాంతిని కలిగి యుండాలని ఆశించినట్లైతే మీరు తగ్గించుకొనుటకు సిద్ధంగా ఉండాలి. మీ స్వంత మార్గం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నించడం మీ చుట్టుపక్కల వారిని బాధపెడుతుంది మరియు గాయపరుస్తుంది. ప్రతి ఒక్కరితో శాంతియుతంగా జీవించాలన్న పౌలు ప్రోత్సాహాన్ని మీరు హృదయపూర్వకంగా తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ సంబంధాలను ఆయన ఆనందం మరియు శాంతితో నింపుతాడు.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మ, నేను విచ్ఛిన్నం కాకుండా తగ్గించుకొనుటకు నాకు సహాయం చెయ్యండి. నా సంబంధాలలో మీ శాంతిని నేను కోరుకుంటున్నాను, కాబట్టి నేను ఈ రోజు సరళంగా ఉండటానికి ఎంచుకున్నాను.