యేసును గురించి ఎలా తెలుసుకోవాలి - How to Know Jesus

యేసును గురించి ఎలా తెలుసుకోవాలి

యేసును గురించి ఎలా తెలుసుకోవాలో మీరు నేర్చుకొనినప్పుడు, మీ జీవితమును గురించి దేవుడు కలిగియున్న ప్రణాళిక లోనికి అద్భుతమైన ప్రయాణమును మీరు ప్రారంభిస్తారు.

రోమా 3:23 ఇలా చెప్తుంది: “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు”. యేసును తెలుసు కొనుట అనునది కేవలం ఆయన కొరకు మీరు కలిగియున్న అవసరతను అంగీకరించుట, ఆయన మీ కొరకు చేసిన దానిని నమ్ముట మరియు ఆయన అద్భుతమైన బహుమానమును అంగీకరించుట.  మీరు పాపము చేసియున్నారు మరియు మీకు ఒక రక్షకుడు అవసరము కనుక మీ జీవితమును మీయంతట మీరే జీవించలేరని ఇది గుర్తిస్తుంది.  మరియు యేసును గురించి తెలుసుకొనుట, రక్షించబడుటను గురించిన శుభవార్త ఆ సమయంలో జరిగే ఒక అందమైన మార్పిడియై యున్నది. మీరు చేసిన ప్రతి చెడు మరియు పాపపు పనులను ఆయనకు అప్పగించుము మరియు దానికి బదులుగా దేవుడు మీ కొరకు దాచియుంచిన సమస్థమును మీకు అనుగ్రహించును. ఒకవేళ మీకు తెలిసిన లేక ఇంకనూ తెలియక పోయినా మీ జీవితము యెడల ఆయన కలిగియున్న ప్రణాళిక అద్భుతమైనది  మరియు ఆ ప్రయాణములో ఇది మీ మొదటి అడుగు.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. .”— యోహాను  3:16

ప్రార్ధన

రోమా 10:9 చెప్పునదే మనగా “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు”. ఒకవేళ యేసుతో నీవు వ్యక్తిగత సంబంధమును కలిగి యుండునట్లు ఆయన నిన్ను పిలుస్తున్నట్లైతే, నీవు చేసే ప్రతి పనిలో ఆయనను అనుసరించుటకు నీవు సిద్ధంగా ఉండునట్లు, ఈ ప్రార్ధనను గొంతెత్తి చేయుము:

 

“యేసు, నేను పాపము చేసియున్నానని మరియు నాకు రక్షకుని అవసరత ఉన్నదని నేనెరుగుదును. మీరు సిలువనెక్కినప్పుడు, మీరు నా కొరకు మరియు నా పాపముల కొరకు అక్కడికి వెళ్లారని నేను నమ్ముచున్నాను.  మీరు నన్ను ఇప్పుడే రక్షిస్తారని నేను నమ్ముతున్నాను. నా జీవితమును మీకు సమర్పిస్తున్నాను. ఈరోజు, నేను రక్షించబడ్డానని మీరు నన్ను క్షమించియున్నారని నేనెరుగుదును, ప్రతిరోజూ మీ కొరకు జీవించుటలోని పరమార్ధమును నేను అర్ధం చేసుకొనునట్లు నాకు సహాయం చేయుము. అమెన్!”

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon