బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును…. ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు… —కీర్తనలు 146:7-9
అణచివేయబడిన వారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి, వితంతువులకు, అనాధలకు, తండ్రిలేని వారికి, విదేశీయులను గురించిన మన బాధ్యతను బైబిల్లో దేవుడు మాట్లాడి యున్నాడు. ఆయన ఒంటరిగా, నిర్లక్ష్యం చేయబడిన, మర్చిపోబడిన, విలువ తగ్గించబడిన వారి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన అణచివేయబడిన వారికొరకు మరియు ఆకలితో ఉన్నవారి కొరకు చాలా శ్రద్ధను కలిగియున్నాడు.
ప్రజలు అనేక రకాలుగా ఆకలిని కలిగి యుంటారు. వారు తినుటకు సమృద్ధిని కలిగి యుంటారు కానీ విలువైన వారుగా గుర్తించబడుటకు మరియు ప్రేమించబడుటలో ఆకలిని కలిగి యుంటారు. ఎవరైతే దుఖ:ముతో నలిగి పోయి ఉంటారో ఆయన వారిని లేవనెత్తును; దేవుడు పరదేశులను కాపాడును మరియు తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించును. ఆయన దీనిని ఎలా చేస్తాడు? ఆయన ప్రజల ద్వారా దీనిని చేస్తాడు. ఆయన ఇతరుల అవసరతలను తీర్చుటకు సమర్పించుకొనిన వారిని, లోబడే వారిని, ప్రతిష్టించుకొనిన వారిని ఉపయోగించుకుంటాడు.
ఒకసారి మదర్ తెరెసా ఇలా చెప్పారు, “ప్రేమను యధార్ధముగా ఉండాలని మరియు అసాధరణముగా ఉండాలని ఆలోచించవద్దు. మనము చేయవలసినదల్లా అలసిపోకుండా ప్రేమించుటయే.”
అనుదినము మనము ఎదుర్కొనే అనేక మంది ప్రజలు ఎవరైనా ఒకరు రక్షిస్తేనే వారు బ్రతుకుతారని – మరియు ఆ ఎవరైనా మీరు లేక నేను అవ్వచు అని అర్ధం చేసుకొనియున్నాను. గాయపడిన మరియు నలిగిన వారి కొరకు ఆత్మీయముగా, ఉద్రేకముగా, మరియు శరీరకముగా నలిగిన వారి అవసరతలలో ఉన్న వారి కొరకు మన ద్వారా పని చేయునట్లు దేవుని ప్రేమను అనుమతించుదాము. అలసిపోకుండా ప్రేమించుదాము.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, అలసిపోకుండా ప్రేమించుటకు నన్ను బలపరచుము. గాయపడిన వారు మరియు అవసరతలో ఉన్నవారి యెడల కనికరపడునట్లు మీ హృదయమును నాకివ్వండి మరియు వారి అవసరతలను ఎలా తీర్చాలో నాకు చూపించండి.