ఆత్మీయ పరిపక్వతకు నిజమైన పరీక్ష

ఆత్మీయ పరిపక్వతకు నిజమైన పరీక్ష

యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.   —గలతీ 5:6

సమస్తము కంటే మనము దేవుని కొరకు మరియు ఇతరుల కొరకు యధార్ధముగా, పరిశుద్ధముగా, ప్రేమతో ఉండవలెను. మన జీవితములో ఒకే విషయమును మనము వ్యవహరించినట్లైతే, అదేదనగా ఇతరుల యెడల ప్రేమ కలిగి యుండుటయే.

అనేక మంది ఆత్మీయ పరిపక్వతకు మొదటి గుర్తు గొప్ప విశ్వాసము అని అనుకుంటారు. కానీ ప్రేమలో నడచుట యనునది ఆత్మీయ పరిపక్వతలో నిజమైన పరీక్షయై యున్నది మరియు అది మన విశ్వాసపు నడకకు శక్తి అందిస్తుంది.

విశ్వాసము ప్రేమ ద్వారా పని చేస్తుందని బైబిల్ బోధిస్తుంది. గలతీ 5:6 బోధించున దేమనగా విశ్వాసమనునది ప్రేమ ద్వారా మాత్రమే బలము పొందుకొని శక్తిని కలిగి పని చేస్తుంది. ప్రేమ అనునది మనము చెప్పునది లేక సిద్ధాతం కాదు: అది ఒక క్రియ.

ప్రేమ లేకుండా విశ్వాసములో నడచుటకు ప్రయత్నించుట అనగా బ్యాటరీ లేకుండా ఫ్లాష్ లైట్ కలిగి యుండుట. ప్రేమయనే బ్యాటరీతో మనము ఎల్లప్పుడూ విశ్వాసమునకు చార్జింగ్ చేసుకోవాలి. లేని యెడల అది పని చేయదు!  క్రైస్తవులు వారి జీవితంలో విశ్వాసములో మరియు దేవునితో సంబంధమును కలిగి యుండుటలో ప్రాముఖ్య భాగమైన ప్రేమలో నడవకుండా ఉన్నట్లైతే వారు సమస్యలను ఎదుర్కొంటారు.

కాబట్టి, ప్రేమయనే జీవితమును పొందుకోండి మరియు మీ విశ్వాసము బలపరచబడి ఎదుగునట్లు చుడండి. దేవుని ప్రేమ మొదట ఉన్నట్లయితే  సమస్తము దానిని అనుసరించును.

ప్రారంభ ప్రార్థన

దేవా, ప్రేమ లేకుండా నా విశ్వాసము వ్యర్ధమని నాకు తెలుసు. మీ ప్రేమతో ప్రవహించే జీవితమును నాకు అనుగ్రహించుము. మీ ప్రేమను పొందుకొనుటకు మరియు ఇతరులకు మీ ప్రేమను పంచుటకు నన్ను నడిపించుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon