ఆయన శ్రమలను పంచుకొనుట

ఆయన శ్రమలను పంచుకొనుట

… మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను! —రోమా 8:18

క్రైస్తవులముగా, క్రీస్తు యొక్క మహిమలో మనము పంచుకొనుటయనే ఆలోచనను ఇష్టపడుతున్నాము, కానీ కష్టములను పంచుకొనుట గురించి ఏముంది? యేసు యొక్క బలియాగము మనకు నిత్యజీవమనే వరమును ఇస్తుంది మరియు మనము ఈ లోకములో ఉండగా సమృద్దియైన జీవితమును ఇస్తుంది. కానీ మనము ఆయన మహిమలో భాగమును కలిగియుంటే శోధన కాలములలో కూడా బాధను అనుభవించాలని బైబిల్ బోధిస్తుంది. అది యోగ్యమైనదా? రోమా 8:18 ప్రకారము ఇది ఖచ్చితముగా యోగ్యమైనదే!

మన పరిస్థితుల వలన మనము బాధలు పొందుతున్నామని నమ్ముతాము మరియు ఒకవేళ అవి మారినట్లయితే మనము బాగుగా పని చేయగలము. కానీ దేవుడు మనలను చాలా పరిపక్వత గల వారుగా మరియు స్థిరమైన వారుగా మారాలని ఆశిస్తున్నాడు తద్వారా మన పరిస్థితులు అనుకూలముగా లేకపోయినా మనము యధార్ధముగా పని చేయగలము. ఇక్కడ విభిన్న విశ్వాసపు స్థాయిలున్నాయి మరియు చాల సమయాల్లో మనము బాధ నుండి విడిపించబడుటకు మన విశ్వాసమును ఉపయోగించ వలసి యున్నది. కానీ కొన్నిసార్లు మనము మన జీవిత సవాళ్ళ గుండా వెళ్ళుటకు ఉన్నత స్థాయిలోని విశ్వాసమును అభ్యాసం చేయాలి.

చాలా తరచుగా మనము దేవుని శక్తిని చూసినప్పుడు ఆయన వర్చస్సు, శక్తినిచ్చు ఆయన శక్తిని చూసి ఎంతో ఆశ్చర్యపోతాము. యేసు యోహాను 16:33 లో శోధన సమయంలో సమాధానమును మరియు వాటిని జయించుటకు శక్తిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. నేను మిమ్మల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నదేమనగా, ఒకవేళ మీరు బాధల సమయంలో గుండా వెళ్తున్నప్పుడు, క్రీస్తులో ఉన్నారు కాబట్టి మీరు వాటి నుండి బయటపడునట్లు మరియు ప్రత్యక్షపరచ బడిన ఆయన మహిమలో పాలి వారగునట్లు మీ హృదయములోనికి తీసుకోండి!


ప్రార్ధనా స్టార్టర్

ప్రభువా, రోమా 8:18 చెప్పునదేమనగా మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను. నేను అదే వైఖరిని కలిగి యుండాలని ఆశిస్తున్నాను. నా మార్గములో వచ్చే శ్రమల గుండా వెళ్ళుటకు నాకు సమాధానమును మరియు శక్తిని అనుగ్రహించినందుకు వందనములు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon