కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది. —మత్తయి 7:12
మన జీవితములో కుమ్మరించునట్లు దేవుడు అనేక ఆశీర్వాదములను కలిగి యున్నాడు, కానీ మనలో అనేక మంది మన కొరకు ఎవరైనా మేలు చేయాలని ఆశించినట్లే ఇతరులకు వాటిని చేయుటలో మనలో విఫలమవుతున్నామనుటయే దీనికి కారణము. మనము ఇతరుల ద్వారా ఆశీర్వదించబడవలేనని ఆశిస్తాం కానీ మనము స్వార్ధము లేకుండా వారిని ముందుగా ఆశీర్వదించుటకు ముందుకు వస్తున్నామా?
మీ వివాహము, కుటుంబము లేక స్నేహము ఎలా ఉండాలో ఆ విధముగా లేని యెడల నీవు వెంటనే ఈ సూత్రమును అన్వయించుకుంటావు.
మీ భాగస్వామి మీ కొరకు ఏదైనా చేయాలని వేచియుంటావు. లేక మీ స్నేహితుడు మీ కొరకు ముందుగా సహాయం చేయాలని ఆశిస్తావు కానీ నీవు వారికి సహాయం చేయాలంటే చాలా కఠినముగా తిరస్కరిస్తావు. ఈవిధముగా జీవించుట వలన మీరు స్వార్ధముగా సౌకర్యవంతముగా ఉండగలరు కానీ వారు మీ పరిస్థితులకు మారాలంటే నీవు ఉత్సాహముగా వాటిని మార్చుటకు నిర్ణయించుకొనక పోయినట్లయితే అవి మారవు. నిన్ను నీవు తగ్గించుకొని మీ సంబంధములను కాపాడుకొనుటకు ఇదియే సమయం.
నీ మీద నువ్వు దృష్టిని పెట్టుట కంటే, ఆశీర్వదములు మీ మార్గములో రావాలని ఆశించుట కంటే త్యాగము చేయుటకు ఉత్సాహముగా ఎంపిక చేసుకోండి మరియు మీ జీవితములో దేవుడు పెట్టిన ప్రజలకు సేవ చేయండి. సేవకునిగా ఉండుము మరియు ఇతరులను ఆశీర్వదించుట మీద మీ దృష్టి నిలపండి.
మీరు తృణీకరించబడ్డారని మరియు అలక్ష్యము చేయబడ్డారని భావించుట కంటే ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశిస్తున్నారో అలాగే ఇతరులను మీరు చూచుట ద్వారా మీ సంబంధములను వృద్ధి చేసుకొనగలరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను స్వార్ధపరమైన జీవితమును జీవించుట ద్వారా నేనేమియు పొందలేను. ప్రజలు నన్ను సంతోష పెట్టాలని ఎదురు చూచుట కంటే నేను ముందుగా వారితో బాగుగా ఉంటాను మరియు నన్ను వారెలా చూడాలని ఆశిస్తున్నారో నేను వారిని అలా చూస్తాను.