నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. (హెబ్రీ 4:7)
మన జీవితంలో ఒక ప్రాంతంలో దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడనప్పుడు, ఇతర ప్రాంతాలలో మనం తరచుగా ఆయన స్వరాన్ని వినలేము. కొన్నిసార్లు మనం వినాలనుకుంటున్నది మాత్రమే వింటాము మరియు దీనిని “ఎన్నుకొనిన దానిని వినుట” అంటారు. ఇది జరిగినప్పుడు, ప్రజలు ఇకపై దేవుని నుండి ఏదియు వినలేరని నమ్ముతారు, కానీ ఇది నిజం కాదు. వాస్తవం ఏమిటంటే, ఆయన ఇప్పటికే వారితో మాట్లాడాడు మరియు వారు స్పందించడంలో విఫలమయ్యారు. నేను వివరించడానికి ఒక కథను పంచుకుంటాను.
ఒక స్త్రీ ఒకసారి, తాను ఏమి చేయాలనుకుంటుందో దాని గురించి తనకు దిశానిర్దేశం చేయమని దేవుడిని కోరినట్లు నాతో చెప్పింది అదేదనగా: నెలల క్రితం జరిగిన నేరానికి తన సోదరిని క్షమించాలని ఆమె ఆశించింది. కానీ ఆ పని చేయలేక పోయింది, కాబట్టి ఆమె వెంటనే ప్రార్థన చేయడం మానేసింది. ఆమె మళ్ళీ ఏదో ఒక దాని కొరకు ప్రభువును వెదకినప్పుడు, ఆమె తన హృదయంలో విన్నదంతా, “ముందు నీ సోదరిని క్షమించు.”
రెండేళ్ల వ్యవధిలో, కొత్త పరిస్థితుల్లో ఆమె దేవుని మార్గదర్శకత్వం కోసం అడిగిన ప్రతిసారీ, తన సోదరిని క్షమించమని మెల్లగా ఆమెకు గుర్తుచేసేవాడు. చివరగా, తను విధేయత చూపకపోతే తాను ఎప్పటికీ తన బలహీనత నుండి బయటపడలేనని లేదా ఆధ్యాత్మికంగా ఎదగనని గ్రహించి, “ప్రభువా, నా సోదరిని క్షమించే శక్తిని నాకు ఇవ్వండి” అని ప్రార్థించింది. తక్షణమే – ఆమె ఇంతకు ముందు పరిగణించని విషయాలను ఆమె తన సోదరి దృక్కోణం నుండి చాలా విషయాలను అర్థం చేసుకుంది. కొద్దికాలంలోనే ఆమె సోదరితో ఆమె సంబంధం పూర్తిగా పునరుద్ధరించబడింది మరియు త్వరగా గతంలో కంటే బలంగా మారింది.
మనం నిజంగా దేవుని నుండి వినాలనుకుంటే, ఆయన చెప్పేదంతా వినడానికి మరియు దానికి ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు వినండి మరియు పాటించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ జీవితములోని ఏ పరిస్థితిలోనైనా వినలా వద్దా అని ఎంపిక చేసుకున్నారా? దేవుని స్వరమును వినుటకు ఇష్టపడండి.