ఒక ఆశీర్వాదమును కోల్పోవద్దు

ఒక ఆశీర్వాదమును కోల్పోవద్దు

నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు (సంతోషంగా, అదృష్టవంతుడిగా మరియు ఈర్ష్యపడడానికి) ధన్యుడు మరియు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును. (సామెతలు 28:14)

దేవుడు మనతో అనేక విభిన్న రకాలుగా మాట్లాడవచ్చు, కానీ మనం మన హృదయాలను కఠినతరం చేసుకొని, ఆయన చెప్పేదానికి మనం విధేయత చూపకపోతే, ఆయన మనకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను కోల్పోతాము. దేవుడు నేను చేయాలనుకున్న ప్రతి చిన్న పని లేదా నేను చేయకూడదనుకున్న ప్రతి పని మన మధ్య కుస్తీ పోటీగా మారిన సమయం నాకు గుర్తుంది. దేవుడు నాతో వ్యవహరించడానికి రోజులు, వారాలు, నెలలు మరియు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టింది, చివరకు ఆయన నన్ను ఏమి అడుగుతున్నాడో దాని గురించి ఆయన తన మనసు మార్చుకోడు అనే వాస్తవాన్ని నేను అంగీకరించాను.

చివరకు నేను ఆయన మార్గములో నడచుటకు సమర్పించుకున్నప్పుడు, నా ఊహకు మించి నన్ను ఆశీర్వదించే విధంగా ఎల్లప్పుడూ పనులు జరుగుతాయి. దేవుడు నన్ను మొదటి సారి చేయమని అడిగినప్పుడు నేను దానిని చేసి ఉన్నట్లైతే, నేను చాలా కష్టాలనుండి తప్పించుకోగలిగాను.

మన మార్గాలు పని చేయకపోయినా, మనలో చాలా మంది మొండిగా మారిపోయి మన మార్గాల్లో స్థిరపడతాము. అయితే, మనం దేవుని పట్ల మృదువుగా ఉండడాన్ని నేర్చుకోవచ్చు మరియు ఆయన స్వరానికి మరియు ఆయన ఆత్మ యొక్క నడిపింపుకు సున్నితంగా మారవచ్చు. మన ఆత్మలు దేవునితో సహవాసం కోసం రూపొందించబడ్డాయి. మనల్ని ఇబ్బందుల నుండి దూరంగా ఉంచడానికి మరియు ఏది సరైనది మరియు ఏది తప్పు అని మాకు తెలియజేయడానికి ఆయన మన అంతర్ దృష్టి మరియు మనస్సాక్షి రెండింటి ద్వారా మాట్లాడతాడు. అప్పుడు, ఆయన ఆత్మ ద్వారా, సరైనది చేయడానికి మనకు సహాయం చేస్తాడు.

మీరు దేవుని యెడల మీరు కలిగియున్న మొండితనాన్ని విడిచిపెట్టి, ఆయన స్వరాన్ని వినడానికి మరియు ఆయన చెప్పిన దానిని పాటించాలని కోరుకునే సున్నిత హృదయంతో ఆయనతో నడవమని నేను ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ స్వంత మార్గముల మీద కాక దేవుని మార్గము మీద నీ దృష్టి నిలుపుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon